Delivery Agent | డెలివ‌రీ ఏజెంట్‌కు లిఫ్ట్ నిరాక‌ర‌ణ‌.. భారీ మూట‌తోనే ఆరు అంత‌స్తులు మెట్లెక్కి..

లిఫ్ట్ అనుమతించకపోవడంతో భారీ పార్శిల్‌తో ఆరు అంతస్తులు మెట్లు ఎక్కిన డెలివరీ ఏజెంట్ వీడియో వైరల్‌గా మారింది. అపార్ట్‌మెంట్ వివక్షపై ఆగ్రహం.

Delivery agent viral video

Delivery Agent | డెలివ‌రీ ఏజెంట్ల స‌మ‌స్య‌లపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. డ్యూటీ స‌మ‌యంలో వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ డెలివ‌రీ ఏజెంట్‌కు సంబంధించిన వీడియో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

డెలివరీ ఏజెంట్లు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ నివాస సముదాయాల్లోని మెయిన్ లిఫ్ట్‌ (elevator)లను ఉపయోగించకుండా సొసైటీ నిబంధనల పేరుతో అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా ప్యాకర్స్ అండ్ మూవర్స్, ఫుడ్ డెలివరీ సిబ్బందిపై ఇటువంటి వివక్ష చూపుతూ నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఎత్తైన భ‌వ‌నాల్లో డెలివ‌రీ చేసేందుకు వెళ్లే ఏజెంట్లు (delivery agent) తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. కొన్ని అంత‌స్తుల మేర మెట్లు ఎక్కుతూ ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే అనేకం వెలుగుచూశాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మరొక‌టి వెలుగులోకి వ‌చ్చింది.

నివాస భ‌వ‌నంలోని లిఫ్ట్ నిరాక‌రించ‌డంతో ఓ డెలివ‌రీ ఏజెంట్ భారీ పార్శిల్‌తో ఏకంగా ఆరు అంత‌స్తులు మెట్లు ఎక్కుతూ వెళ్లాడు. భుజంపై మోయ‌లేని బ‌రువుతోనే కింద, మీద ప‌డుతూ చివ‌రికి ఆరు అంత‌స్తులూ ఎక్కాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు, సెక్యూరిటీ సిబ్బంది తీరుపై మండిప‌డుతున్నారు.

డెలివరీ సిబ్బందిని మానవతా దృక్పథంతో చూడాల‌ని కామెంట్లు చేస్తున్నారు. వారికి లిఫ్ట్ స‌దుపాయం క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వివక్షపూరిత నియమాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోయ‌లేని బ‌రువుతో వారు అన్ని అంత‌స్తులు ఎక్కుతే ప్రాణాలు ఉండాలా..? పోవాలా..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. డెలివ‌రీ ఏజెంట్ల ప‌ట్ల క‌నీస సానుభూతితో ఉండాలని సూచిస్తున్నారు. ఇక స్విగ్గీ, జొమాటో వంటి సంస్థ‌లు సైతం ఈ వీడియోపై స్పందిస్తున్నాయి. త‌మ ఏజెంట్ల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. డెలివ‌రీ ఏజెంట్ల‌కు లిఫ్ట్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. మ‌రోవైపు డెలివరీ ఏజెంట్లపై ఒత్తిడిని తగ్గించేందుకు 10 నిమిషాల డెలివరీ విధానాలను తొల‌గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

VIROSH | విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి ఏర్పాట్లు .. ఎందుకిలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు..!
Father Kills Daughter : పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కూతురిని హత్య చేసిన తండ్రి

Latest News