VIROSH | విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి ఏర్పాట్లు .. ఎందుకిలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు..!
VIROSH | టాలీవుడ్‌లో మరోసారి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి.
VIROSH | టాలీవుడ్‌లో మరోసారి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ నేషనల్ మీడియా కథనాలు వెలువడుతుండగా, అదే సమయంలో అక్కడి ఓ హెరిటేజ్ ప్యాలెస్‌లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వైరల్ అవుతున్న వీడియోలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో డెకరేషన్ పనులు జరుగుతున్న దృశ్యాలు కనిపించడంతో అది విజయ్ – రష్మిక పెళ్లి ఏర్పాట్లేనంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ వీడియోపై అధికారిక స్పష్టత లేకపోవడంతో సినీ వర్గాలు దీనిని కేవలం ఊహాగానాలుగానే చూడాలని సూచిస్తున్నాయి. అయినప్పటికీ అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట తమ పెళ్లిని అత్యంత గోప్యంగా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే నిర్వహించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిశ్చితార్థం జరిగినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదనే ప్రచారం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలోనే వీరి నిశ్చితార్థం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చినా, ఇద్దరూ దానిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో రష్మికను పెళ్లి వార్తలపై ప్రశ్నించగా ఆమె నవ్వుతూ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పెళ్లి వేడుకను సైలెంట్‌గా నిర్వహించినప్పటికీ, అనంతరం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది.
విజయ్ – రష్మిక మధ్య స్నేహం ఎప్పటినుంచో చర్చనీయాంశమే. పబ్లిక్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడం, ఒకే లొకేషన్లలో ఫోటోలు షేర్ చేయడం, విదేశీ వెకేషన్లకు కలిసి వెళ్లారనే వార్తలు తరచూ వినిపించడం ప్రేమ ఉందనే ప్రచారానికి బలం చేకూర్చాయి. ఇటీవల ఇటలీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకుని కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారనే వార్తలు కూడా ఈ ఊహాగానాలకు మరింత వేడి జోడించాయి.
మొత్తానికి ఒకవైపు పెళ్లి ఏర్పాట్లపై వైరల్ వీడియోలు, మరోవైపు పూర్తి మౌనం పాటిస్తున్న విజయ్ – రష్మిక… ఈ పరిణామాలతో ‘విరోష్’ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలు నిజమా కాదా అన్నది స్పష్టత రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట పెళ్లి చర్చలు ఆగేలా కనిపించడం లేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram