Father Kills Daughter : పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కూతురిని హత్య చేసిన తండ్రి

సర్పంచ్ కావాలనే పిచ్చితో కన్నకూతురినే కడతేర్చిన తండ్రి! ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడనే నిబంధనే ప్రాచీ ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఘోరం!

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 02, 2026, 3:09 pm IST
Read Time: 3 mins
Father Kills Daughter : పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కూతురిని హత్య చేసిన తండ్రి

విధాత: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతురినే హత్య చేసిన తండ్రి దుర్మార్గం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ నిజాం సాగర్ కెనాల్లో ఇటీవల లభించిన బాలిక మృతదేహం కేసులో విస్తూ పోయే నిజాలు బయటకు వచ్చాయి.

మహారాష్ట్రలోని ముత్కూరు మండలం కేరూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పాండురంగం అనే వ్యక్తి పోటీకి సిద్దపడ్డాడు. అయితే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన తనకు అడ్డుగా ఉందన్న కారణంతో తనకు ఉన్న ముగ్గురు పిల్లలో ఒకరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుత సర్పంచ్ గణేష్ తో కలిసి ముగ్గురు పిల్లల్లో ఒకరిని హత్య చేసేందుకు కుట్ర చేశాడు.

పెద్ద కూతురు ప్రాచీని తీసుకుని తండ్రి పాండురంగ నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి వెళ్లి నిజాం సాగర్ కాలువలోకి తోసివేశాడు. తండ్రి కుట్రకు బలైన ప్రాచీ కాలువ నీటిలో మునిగి చనిపోయింది. కూతురును హత్య చేసిన తండ్రి పాండురంగంను, హత్యకు ప్రేరేపించిన ప్రస్తుత కేరూరు సర్పంచ్ గణేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి :

TDP leader Royal Murali : మీడియా ముందు చెప్పుతో కొట్టుకున్న టీడీపీ నేత రాయల్ మురళి
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల సంఘానికి ఫహీం ఖురేషి ఫిర్యాదు