TDP leader Royal Murali : మీడియా ముందు చెప్పుతో కొట్టుకున్న టీడీపీ నేత రాయల్ మురళి

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేత రాయల్ మురళి మీడియా ముందు చెప్పులతో చెంపలు కొట్టుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 02, 2026, 2:39 pm IST
Read Time: 3 mins
TDP leader Royal Murali : మీడియా ముందు చెప్పుతో కొట్టుకున్న టీడీపీ నేత రాయల్ మురళి

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన అనంతపురం టీడీపీ నేత రాయల్ మురళి మీడియా సమావేశంలో తన రెండు చెప్పులతో రెండు చెంపలపై కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడే క్రమంలో రాయల్ మురళి తీవ్ర ఆగ్రహంతో కాపు కులంలో అంబటి చెడ పుట్టాడని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమ కులం పరువు తీశాడంటూ మండిపడుతూ చెప్పులతో కొట్టుకున్నాడు. రాయల్ మురళి చర్య ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అంబటి రాంబాబు లాంటి వాళ్లు మా సామాజిక వర్గంలో ఉన్నందుకు మేము చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది మురళి చెప్పుకొచ్చారు. తెలుగు వాళ్లు తల దించుకునే విధంగా మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. గత 40 ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా తెలుగు ప్రజల మంచి కోసం పని చేస్తున్న సీఎం చంద్రబాబుపై అలాంటి వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. అంబటి రాంబాబు వల్ల కాపులను చిన్న చూపు చూస్తున్నారు అని మురళి పేర్కొన్నారు. ఒకప్పుడు వంగవీటి రంగారావు విగ్రహాన్ని పెట్టి కాపులను గౌరవిస్తే..అంబటి కారణంగా చెప్పులతో కొట్టి కాపులను అవమానిస్తున్న దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి :

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల సంఘానికి ఫహీం ఖురేషి ఫిర్యాదు
Nirmala Sitharaman | నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ చీర స్పెష‌ల్ ఇదే.. నెట్టింట విప‌రీతంగా చ‌ర్చ‌