ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల సంఘానికి ఫహీం ఖురేషి ఫిర్యాదు

పోలీస్ అధికారిణి మతాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల సంఘానికి ఫహీం ఖురేషి ఫిర్యాదు చేశారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 02, 2026, 1:28 pm IST
Read Time: 3 mins
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల సంఘానికి ఫహీం ఖురేషి ఫిర్యాదు

విధాత, హైదరాబాద్ : పోలీస్ అధికారిణి మతం పేరుతో విమర్శించిన బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) వైస్ చైర్మన్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ (Md. Faheemuddin Qureshi) మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన అధికారిపై చేసిన విమర్శలతో మైనారిటీలపై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం అయిందన్న ఫహీం ఖురేషి విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ 24 గంటల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల వేములవాడ వీణవంకలో జరిగిన చిన్న మేడారం జాతరలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను మతాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ఒక పోలీస్ ఉన్నతాధికారి మతాన్ని తప్పుగా చిత్రీకరించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఐపీఎస్ అధికారులు సంఘం సైతం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

ఇవి కూడా చదవండి :

పిలిస్తే సిట్ విచారణకు వెళ్తా : కల్వకుంట్ల కవిత
Ram Charan | అభిమానం ఉన్మాదంగా మారుతుందా.. అపోలో ఆసుపత్రి వద్ద రామ్ చరణ్‌ని ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్