Koti ATM Robbery Case : కోఠి కాల్పుల కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు!

కోఠిలో ATM వద్ద కాల్పుల కేసులో రూ.6లక్షల చోరీ, నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడని గుర్తించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

SBI ATM Theft In Koti

విధాత, హైదరాబాద్ : కోఠిలో ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6లక్షలు చోరీ చేసి పరారైన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితులు ఇద్దరిలో ఒకరు పాత నేరస్తుడని గుర్తించారు. సెల్ ఫోన్ టవర్ డంపింగ్ ద్వారా మొబైల్ నెంబర్ సేకరించారు. ఇందుకోసం 800లకు పైగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు.

నిందితులు తప్పించుకునేందుకు పోలీసులను తప్పుదోవ పట్టించేలా వారు తెలివిగా వ్యవహరించారు. కాల్పులు జరిపి పారిపోతున్న క్రమంలో కాచిగూడ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు నమ్మాలని అక్కడే స్కూటీ వదిలేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ డీమార్ట్ దగ్గర నిందితులు ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. బట్టలు మార్చుకుని క్యాప్స్ పెట్టుకుని కొత్త వేషధారణలో పారిపోయారు. అక్కడి నుంచి ఆటో తీసుకుని చాంద్రాయణగుట్ట వైపు వెళ్లారు.

ఘటన జరిగిన వెంటనే ట్రైన్‌లో వెళితే పట్టుబడతామని ఊహించిన నిందితులు.. ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ద్వారా ఏ రూట్ లో ఎక్కడికి వెళ్లారు? అనేదానిపై పోలీస్ బృందాలు దర్యాప్తు సాగించాయి. దుండగుల కాల్పుల్లో గాయపడిన బాధితుడు రిషద్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

Nalgonda : లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
Allu Arjun | రామ్ చ‌ర‌ణ్ దంప‌తులకి బన్నీ స్పెష‌ల్ విషెస్.. పోస్ట్‌లో చిరంజీవి గురించి ప్ర‌త్యేకమైన కామెంట్

Latest News