MLC Jeevan Reddy | ఐఏఎస్ స్మితా సభర్వాల్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం

ఐఏఎస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ కోటాపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Publish Date - August 1, 2024 / 03:44 PM IST

విధాత, హైదరాబాద్‌ : ఐఏఎస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ కోటాపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శాసనమండలిలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్మితా సభర్వాల్ దివ్యాంగులను కించపరిచేలా, వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా పదే పదే వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. దివ్యాంగులను అవమానించేలా మాట్లాడిన స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితా మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ నే అవమానించారని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధానాన్ని ఆమె ప్రశ్నించారన్నారు. దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడితే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదో నాకు అర్ధం కావడం లేదన్నారు. స్మితా సబర్వాల్ పై చర్యలు తీసకోవాలని మండలి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తిని పంపాలని కోరారు.