Site icon vidhaatha

సుప్రీంలో అజారుద్ధిన్‌కు చుక్కెదురు

విధాత :హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించడాన్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తనని హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని అజార్ కోరారు.


అయితే ఇప్పటికే ఓటర్ జాబితా వచ్చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తరుణంలో జోక్యం చేసుకోలేమని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు ఏకసభ్య కమిటీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపింది. అజారుద్దీన్ వాదనతో విభేదించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 31 కు వాయిదా వేసింది.

Exit mobile version