పేదలకు ఉచిత న్యాయ సేవ‌లందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయం: జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: న్యాయం ముందు అందరూ సమానులేనని నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే సేవాధికార సంస్థ ధ్యేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అన్నారు. ఏ పౌరుడు ఆర్థిక, ఇతర ఏ కారణాల వల్ల కూడా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉచిత న్యాయ సహాయం పొందడం కోసం 23 జిల్లాలలో జిల్లా న్యాయ సేవా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. సోమవారం వర్చువల్‌ విధానంలో […]

  • Publish Date - January 2, 2023 / 11:25 AM IST

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: న్యాయం ముందు అందరూ సమానులేనని నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే సేవాధికార సంస్థ ధ్యేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అన్నారు.

ఏ పౌరుడు ఆర్థిక, ఇతర ఏ కారణాల వల్ల కూడా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉచిత న్యాయ సహాయం పొందడం కోసం 23 జిల్లాలలో జిల్లా న్యాయ సేవా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.

సోమవారం వర్చువల్‌ విధానంలో జిల్లా న్యాయ సేవాసంస్థల సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన న్యాయ సేవలందించేందుకు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా గత 25 సంవత్సరాల నుండి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని అన్నారు. నేడు జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న న్యాయ సేవా సంస్థల సేవలను పేద ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.

జిల్లా ప్రిన్సిపాల్‌ సెషన్స్‌ జడ్జి లక్ష్మి శారద మాట్లాడుతూ న్యాయ సేవ సంస్థ ద్వారా సామాన్య ప్రజలకు న్యాయ సేవలందించడం, లోక్‌ అదాలత్‌లను నిర్వహించి 3 లక్షలలోపు ఆదాయం గల వారికి ఉచిత న్యాయ సేవలందించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసి న్యాయ సేవ లందించడం జరుగుతుందని అన్నారు.

స్వతహాగా న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని పేదవారికి న్యాయవాదులను ఏర్పాటు చేయడం, వారికి న్యాయపరమైన హక్కులు, సేవలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించేందుకు న్యాయ సేవ సంస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా జిల్లా న్యాయసేవాసంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

అనంతరం కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవ సంస్థ భవనంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా పలువురు న్యాయవాదులు రక్తదానం చేశారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు.

కార్యక్రమంలో సెక్రటరి-కం -సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ప్రథమశ్రేణి జుడిసియల్ మేజిస్ట్రేట్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రీటా లాల్ చాంద్, జూనియర్ సివిల్ జడ్జి కల్పన, బార్ అసోసియేషన్ అధ్యక్షలు బాలయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైజల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.