50వేల మెజార్టీతో గెలుస్తాం: ఉత్తమ్ దంపతుల ధీమా

విధాత: రానున్న ఎన్నికల్లో తాము హుజూర్‌న‌గర్ కోదాడ నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తామని పిసిసి మాజీ ఉపాధ్యక్షుడు నల్గొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు ధీమా వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనంకు హాజరైన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, […]

  • Publish Date - January 1, 2023 / 03:21 PM IST

విధాత: రానున్న ఎన్నికల్లో తాము హుజూర్‌న‌గర్ కోదాడ నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తామని పిసిసి మాజీ ఉపాధ్యక్షుడు నల్గొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు ధీమా వ్యక్తం చేశారు.

నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనంకు హాజరైన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

మా జీవితాలు హుజుర్ నగర్, కోదాడ నియోజక వర్గ ప్రజలకే అంకితమన్నారు. ఈప్రాంత అభివృద్దే మాధ్యేయమన్నారు. పార్టీ కోసం తమ కోసం అనేక త్యాగాలతో పని చేస్తున్న కార్యకర్తలకు తాము శాల్యూట్ చేస్తున్నామన్నారు.

ఈ సంధర్బంగా నల్లగొండ గద్దర్ నర్సిరెడ్డి, ప్రముఖ కళాకారుడు బిచ్చు నాయక్, మిమిక్రి ఆర్టిస్ట్ రమేష్ వారి కళారూపాల ద్వారా సభికులను అలరింప చేశారు. అదేవిధంగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన జానపద, సినీ గేయాలతో, ఆట, పాటలతో ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా సాగింది.