బంగారం తాపడం పనులు వేగం చేయండి
పెండింగ్ వివరాలు ఇవ్వండి
హైదరాబాద్ బయట మరో జూ పార్క్ ఏర్పాటు చేయండి
CM Revanth Reddy | టీటీడీ బోర్డు (TTD Board) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు(Yadagirigutta Temple Board) ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ దిశగా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో స్పీడ్ ప్రాజెక్టుల(speed projects)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు.
భక్తులకు(devotees) సౌకర్యాలు , భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు. ఆలయ రాజగోపురాని(Rajagopuram of the temple)కి బంగారు తాపడం(gold plating) పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వెళ్లేదని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలన్నారు. వైటీడీఏ(YTDA), యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలని అధికారులకు తెలిపారు.
సిటీ బయట మరో జూ పార్క్(Another zoo park outside the city) రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి(development of tourism) కొత్త పాలసీ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు తెలిపారు. ఎకో, టెంపుల్ టూరిజం(temple tourism) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించమన్నారు. వీటితోపాటు హెల్త్ టూరిజం(health tourism)ను అభివృద్ధి చేయాలని చెప్పారు. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించమన్నారు. మనకున్న వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని తెలిపారు. అవకాశం ఉన్నచోట హెలీ టూరిజం అభివృద్ధికీ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.