విధాత: మునుగోడు ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక ఇది అని, రూ. 18 వేల కోట్ల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్నిరాజగోపాల్‌రెడ్డి తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో్ మంత్రి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న కంపెనీకి రూ. 18 వేల కోట్లు ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.
మునుగోడు సమస్యలపై రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడూ ప్రస్తావించలేదు. నేతన్నల సమస్యలపై ఏనాడు అసెంబ్లీలో ప్రస్తావించలేదు. మునుగోడు ప్రజల ఓట్లు అంగడి సరుకులుగా కొంటున్నారని మంత్రి ఆరోపించారు. డబ్బులు ఇస్తే తీసుకోండి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు వేయాలని కోరారు.