Manchu Lakshmi | ఎట్టకేలకు.. మనోజ్ పెళ్లిపై మంచక్క ఓపెనైంది

Manchu Lakshmi విధాత‌: మంచు ఫ్యామిలీలో ప్రేమ వ్యవహారాలకేం కొదవలేదు. విష్ణు, మనోజ్, మంచు లక్ష్మీ ఎవరికి వారికే ప్రత్యేక లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ప్రేమ బంధాలను, పెళ్లి బంధం వరకు తీసుకెళ్లారు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఓకే కానీ.. మంచు మనోజ్ విషయంలోనే ఆ మధ్య పెళ్లి తేడా కొట్టింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న మనోజ్.. తన స్నేహితురాలిని రెండో పెళ్లి చేసుకునేందుకు సాహసమే చేశాడు. ఈ […]

  • Publish Date - July 14, 2023 / 03:25 AM IST

Manchu Lakshmi

విధాత‌: మంచు ఫ్యామిలీలో ప్రేమ వ్యవహారాలకేం కొదవలేదు. విష్ణు, మనోజ్, మంచు లక్ష్మీ ఎవరికి వారికే ప్రత్యేక లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ప్రేమ బంధాలను, పెళ్లి బంధం వరకు తీసుకెళ్లారు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఓకే కానీ.. మంచు మనోజ్ విషయంలోనే ఆ మధ్య పెళ్లి తేడా కొట్టింది.

అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న మనోజ్.. తన స్నేహితురాలిని రెండో పెళ్లి చేసుకునేందుకు సాహసమే చేశాడు. ఈ పెళ్లి విషయంలో తమ్ముడి శ్రేయస్సు కోరుకుంది మంచక్క. తన తోడబుట్టిన వాడి జీవితం ఇకపైనైనా వివాహబంధంతో ఒకటి కావాలని మంచు లక్ష్మి ఓ అడుగు ముందుకేసింది. తమ్ముడి ప్రేమ విషయాన్ని పెద్దల వరకూ తీసుకువెళ్ళి వాళ్ళ పెళ్ళికి శుభం కార్డు పడేవరకూ తోడుగా ఉంది.

మంచు మనోజ్, భూమా మౌనికల వివాహం జరగాలని, దీనికి తండ్రి మోహన్ బాబు నుంచి ఎలాంటి వ్యతిరేకతా ఎదురుకాకూడదని యాదాద్రిలో మొక్కులు మొక్కానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మంచు లక్ష్మీ. పెళ్ళికి అంతా సిద్ధం అనుకున్నాక, తమ్ముణ్ణి దగ్గరుండి పెళ్ళికొడుకుని చేసి, అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించి ఇద్దరినీ ఒకటి చేసింది. దీని వెనుక చాలా కథే నడిపించింది అంటోంది మంచు లక్ష్మి.

ఇరు కుటుంబాల పెద్దలకు మనోజ్, మౌనికల గత జీవిత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏమంటారో నని, వాళ్ళు పెళ్ళితో ఒకటి అవ్వాలనుకుంటున్నారనే విషయాన్ని నచ్చ జెప్పడానికి చాలా తంటాలే పడిందట లక్ష్మి. ఇద్దరికీ పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నిజంగానే ఉందా అనే అనుమానంలో ఉండి, పెద్దలు ఈ విషయాన్ని నమ్మడానికి కొంత సమయం పట్టిందట.

అయితే.. వాళ్ళు పెళ్ళి చేసుకుని ఒకటి అవ్వాలనుకుంటున్నారు, మధ్యలో ఆపడానికి మనం ఎవరం అనే క్లారిటీ ఇచ్చి అందరినీ పెళ్ళికి అంగీకరించేలా చేసిందట మంచక్క. అందుకే దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చేసి, పెళ్ళి చేసి.. ఆ దంపతులను యాదాద్రి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకువచ్చింది. మొన్నటి వరకూ తన దగ్గరే ఉన్న మౌనిక, మనోజ్ ఈమధ్యనే వేరు కాపురం పెట్టారు.

అప్పుడప్పుడూ ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం వదినకు కాల్ చేసి అడుగుతుందట మౌనిక. మొన్నటి వరకూ నా దగ్గర ఉన్నప్పుడు అడిగావా ఇప్పుడు అడిగితే చెబుతానా అని.. తెగ ఏడిపిస్తూ ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

దీనిని బట్టే తెలుస్తుంది. తండ్రి మోహన్ బాబుకి, మంచు విష్ణుకి ఈ వివాహ విషయం అంతగా నచ్చలేదని, అందుకే లక్ష్మి తానే అన్నీ అయ్యి ఈ కార్యక్రమాన్ని నడిపించిందని. పెళ్ళికి విష్ణు తప్పదన్నట్టుగా భార్యతో వచ్చి వెంటనే వెళ్లిపోయాడు.

ఇక అన్నదమ్ములు ఇద్దరి మధ్యా వార్ జరుగుతుందనే విషయం ఆమధ్య మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో చూశాకా స్పష్టమైంది. అది అలా ఉంటే ఇదే ఇంటర్వ్యూలో తనకు చాలా మంది పిల్లలు కావాలని ఉండేదని, దేవుడు ఒకరినే ఇచ్చాడని కాస్త నిరాశగానే మనసులో మాటను పంచుకుంది మంచు లక్ష్మి.

Latest News