Dasara Festival | ఈ రోజంతా మంచిదే అయినప్పటికీ.. ఇందులో విజయ ముహుర్తం ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. విజయ దశమి( Vijaya Dashami ) రోజున రవికి ఎనిమిది, ఏడు స్థానాల్లో సూర్యోదయ లగ్నానికి ఐదు, ఆరు లగ్నాల్లో ఉన్నటువంటి సమయాన్ని విజయ ముహుర్తంగా భావిస్తారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముహుర్తం అంటే 48 నిమిషాలు. ఈ 48 నిమిషాలను ఎంతో బలమైన క్షణాలుగా భావించాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం.
అయితే ఈ ఏడాది 2025 అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగDasara Festival ) నేపథ్యంలో విజయ ముహుర్తం మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 2.58 గంటల వరకు ఉన్నట్లు పండితులు పేర్కొన్నారు. ఈ 48 నిమిషాల కాలం ఎంతో బలమైనది. ఎంతో శక్తివంతమైన ఈ ముహుర్తంలో ఏ కొత్త ఆలోచన చేసినా, ఏ కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని పండితుల ప్రగాఢ విశ్వాసం.
ఇక విజయదశమినాడు అపరాజితా పూజ, సీమోల్లంఘనం, శమీపూజ చేస్తే మంచిదని పండితులు అభిప్రాయపడుతున్నారు. దసరా నాటి సాయంత్రం గ్రామ ప్రజలంతా ఊరి పొలిమేర దాటి ఈశాన్య దిక్కున ఉన్న శమీ వృక్షాన్ని పూజించాలని చెబుతున్నారు. సీమోల్లంఘనం శమీ పూజ ముందైనా, తర్వాతైనా చేయొచ్చుఅని పేర్కొంటున్నారు.