Mutton Shops | అక్టోబర్ 2న మాంసం దుకాణాలు బంద్

మహాత్మా గాంధీ జయంతి( Gandhi Birth Anniversary )ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ( GHMC ) పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం( Mutton Shops ), బీఫ్ దుకాణాలు అక్టోబర్ 2న మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది.

జీహెచ్ఎంసీ పరిధిలో వధ‌శాలలు మూసివేత
గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు

Mutton Shops | హైదరాబాద్, సెప్టెంబర్ 29(విధాత) : మహాత్మా గాంధీ జయంతి( Gandhi Birth Anniversary )ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ( GHMC ) పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం( Mutton Shops ), బీఫ్ దుకాణాలు అక్టోబర్ 2న మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది.జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 172వ తీర్మానం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆదేశాల అమలు కోసం సంబంధిత అధికారులందరూ సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version