Local Body Elections | రెండో కాన్పులో క‌వ‌ల‌లు జ‌న్మిస్తే.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయొచ్చా..?

Local Body Elections | తెలంగాణ( Telangana )లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు( Local Body Elections ) షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో.. టికెట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మ‌రం చేశారు. మ‌రోవైపు పోటీ చేసేందుకు ఎవ‌రు అర్హులు.. ఎంత మంది పిల్ల‌లు ఉంటే పోటీ చేసేందుకు అవ‌కాశం ఉంద‌నే విష‌యాల‌పై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి పోటీకి అర్హులు ఎవ‌రో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

Local Body Elections | హైద‌రాబాద్ : తెలంగాణ‌( Telangana )లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల( Local Body Elections ) సంద‌డి మొద‌లైంది. ఆయా గ్రామాల వారీగా స‌ర్పంచ్ రిజ‌ర్వేష‌న్లను( Sarpanch Reservations ) కూడా ఎన్నిక‌ల అధికారులు విడుద‌ల చేశారు. దీంతో ఆశావ‌హులు పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు పంచాయ‌తీ రాజ్ ఎన్నిక‌ల్లో( Panchayat Raj Elections ) పోటీ చేసేందుకు ఎవ‌రు అర్హులు..? ఎంత మంది పిల్ల‌లు ఉంటే పోటీ చేయాల‌నే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి సంబంధించి చ‌ట్టం ఏం చెబుతుంద‌నే విష‌యాల‌ను స‌మ‌గ్రంగా తెలుసుకుందాం.

కుటుంబ నియంత్ర‌ణ( Family Planning ) చ‌ర్య‌ల్లో భాగంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1994లో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇద్ద‌రి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్య‌క్తులు పంచాయ‌తీరాజ్ సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులుగా పేర్కొంటూ.. ఉమ్మ‌డి ఏపీ ప్ర‌భుత్వం చ‌ట్టం చేసింది. ఈ చ‌ట్టం 1995 మే 31వ తేదీన అమ‌ల్లోకి వ‌చ్చింది. దీంతో నాటి నుంచి ముగ్గురు పిల్లలున్న వారికి స్థానిక ఎన్నికల్లో పోటీకి అవకాశం లేదని చట్టం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నిబంధ‌న ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు అర్హులు ఎవ‌రో తెలుసుకుందాం.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీకి అర్హులు ఎవ‌రంటే..?

Exit mobile version