IAS transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌ను నియమించారు.
సంజయ్ కుమార్ – పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పీఆర్ & ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ
సబ్యసాచి ఘోష్ – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కీమ్స్ యూనిట్‌తో పాటు CSR బాధ్యతలు
దాన కిశోర్ – లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యత
ఎన్ శ్రీధర్ – ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
రాహుల్ బొజ్జా – జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ; బీసీ వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత
ఈ శ్రీధర్ – ఇరిగేషన్ & CAD శాఖ కార్యదర్శిగా నియామకం.
గౌరవ్ ఉప్పల్ – ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియామకం; టీజీఆర్‌ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యత.
బీ విజేంద్ర – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం
డి దివ్య – సెర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత
అద్వైత్ కుమార్ సింగ్ – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం
ఎం హనుమంతరావు – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ
సిక్తా పట్నాయక్ – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం
సందీప్ కుమార్ ఝా – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్‌గా నియామకం
ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ
పమేలా సత్పతి – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ
అనురాగ్ జయంతి – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం
రాహుల్ రాజ్ పీఎస్ – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్‌గా నియామకం
భవేశ్ మిశ్రా- ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్.
జితేశ్ వీ పాటిల్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియామకం
రిజ్వానాబాషా షేక్- జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ
సంతోష్ బీఎం – జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ
ప్రతీక్ జైన్ – వికారాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం
స్నేహ శబరీష్ – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ
పీ కాత్యాయని దేవీ – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం
జీ ఫణింద్ర రెడ్డి – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ
చిత్ర మిశ్రా – ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం
గరిమా అగర్వాల్ – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం
దీపక్ తివారి – వికారాబాద్ కలెక్టర్‌గా నియామకం
ప్రతిమా సింగ్ – మెదక్ కలెక్టర్‌గా నియామకం
అంకిత్ – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం
చహత్ భజ్‌పేయి – హనుమకొండ కలెక్టర్‌గా నియామకం, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యత
కుష్బూ గుప్తా – మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం
మంద మకరందు – జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్
ఫైజాన్ అహ్మద్ – మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్
శివేంద్ర ప్రతాప్ – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
పర్మర్ పింకేశ్ కుమార్ – జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్
ఉమా శంకర్ ప్రసాద్ – వికారాబాద్ అదనపు కలెక్టర్
రాష్ట్ర సర్వీస్ (SCS) అధికారుల పోస్టింగ్‌లు
జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ – నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్
పీ చంద్రయ్య – మంచిర్యాల అదనపు కలెక్టర్
వైవీ గణేశ్ – వరంగల్ అదనపు కలెక్టర్
అబ్దుల్ హమీద్ – సిద్ధిపేట అదనపు కలెక్టర్
బీ వెంకటేశ్వర్లు – నిర్మల్ అదనపు కలెక్టర్
ఎన్ కీమ్యా నాయక్ – వనపర్తి అదనపు కలెక్టర్
కే విద్యాసాగర్ – ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం
ఎం సురేందర్ – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం
