అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
విధాత, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పోలీసు నియామక పరీక్షల్లో కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 20 శాతం మార్కులు తగ్గించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అంశంపై తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ , ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించారు.
కాగా 20 కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయాన్ని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.
తాజాగా సీఎం ప్రకటన పట్ల ఎస్ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు, ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.