Home
»
Trending
»
Dghmo Directions For Covid19 Of Children
చిన్న పిల్లల్లో కరోనాపై డీజీహెచ్‌ఎస్ మార్గదర్శకాలు
ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అవసరం లేదు! పిల్లల్లోనూ వైరస్ నాలుగు దశల్లో ఉంటుంది పిల్లల్లో కోవిడ్-19 వస్తే… తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి. సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు. పిల్లల్లోనూ అసింప్టమాటిక్ (లక్షణాలు లేకపోవడం), మైల్డ్ (కొద్దిగా), మోడరేట్ (మధ్యస్థాయి), సివియర్ (తీవ్రం) అనే నాలుగు దశలు ఉంటాయి. పిల్లల విషయంలో సీటీ స్కాన్‌కు బదులుగా చెస్ట్ ఎక్స్‌రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు.