Houthis Attacked|సముద్రంలో గ్రీకు నౌకను ముంచేసిన హౌతి రెబల్స్

విధాత: ఎర్ర సముద్రం అండగా యెమెన్‌లోని హౌతి రెబల్స్ రెచ్చిపోతున్నారు. తాజాగా గ్రీస్ దేశానికి చెందిన ఎటర్నిటీ నౌకను సముద్రంలో ముంచేశారు. సముద్రంలో వెళ్తున్న నౌకపై హౌతీలు గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసి పేల్చేశారు. దాడిలో నౌకకు కిందవైపు భారీ రంధ్రం పడి సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న యురోపియన్‌ యూనియన్‌ నేవీ బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని 10 మంది నౌక సిబ్బందిని రక్షించాయి. అప్పటికే కొంత మంది సిబ్బందిని హౌతిలు కిడ్నాప్ చేశారు. ఈ దాడిలో ముగ్గురు నౌక సిబ్బంది జలసమాధి అయ్యారు. కొంత మంది నౌక సిబ్బంది తమ వద్ద బంధీలుగా ఉన్నారని హౌతీలు ప్రకటించారు.

మరోవైపు, నలుగురు సిబ్బందిని కాపాడామని నేవీ ఫోర్స్ తెలిపింది. పాలస్తీనియులకు మద్దతుగా హౌతి ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఈ వారం వ్యవధిలో ఎర్ర సముద్రంలో హౌతీలు ఇలా వాణిజ్యనౌకపై దాడిచేయడం ఇది రెండోసారి. పాలస్తీనియన్లకు మద్దతుగా మేం దాడులను కొనసాగిస్తాం. గాజా ఆక్రమణను ఇజ్రాయెల్‌ ఆపాల్సిందే’అని హౌతీలు ఒక ప్రకటన విడుదలచేశారు.