Car Number Action | ఈ కారు నెంబర్ యమ కాస్ట్ లీ… హెచ్ఆర్ 88బీ 8888 విలువ తెలుసా?

ఈ మధ్యకాలంలో వాహన యజమానులకు ఫ్యాన్సీ నెంబర్ల పై పిచ్చి పీక్ కు చేరడం అంటే ఇదేనేమో. అది ఏ స్థాయికి పోయిందంటే ఎన్ని లక్షలు, కోట్లు అయినా వెచ్చించేందుకు వెనకాడ్డం లేదు.

మధ్యకాలంలో వాహన యజమానులకు ఫ్యాన్సీ నెంబర్ల పై పిచ్చి పీక్ కు చేరడం అంటే ఇదేనేమో. అది ఏ స్థాయికి పోయిందంటే ఎన్ని లక్షలు, కోట్లు అయినా వెచ్చించేందుకు వెనకాడ్డం లేదు. తన నూతన వాహన ఫ్యాన్సీ నెంబర్ కు ఎవరూ ఊహించని విధంగా ఒక యజమాని రూ.1.17 కోట్లు చెల్లించి దక్కించుకున్నాడు. ఇది ఎక్కడో కాదు భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం మాదిరే హర్యానా లో కూడా ఫ్యాన్సీ లేదా వీఐపీ నెంబర్ ప్లేట్లకు వేలం వేస్తుంటారు. ప్రతివారం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ వేలం పాట వాహనదారులకు అందుబాటులో ఉంటుంది.

వాహన యజమానులు తమకు నచ్చిన నెంబర్ ను ఎంపిక చేసుకుని వేలం పాటలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరూ ముందుకు రానట్లయితే రవాణా అధికారులు నిర్ణయించిన నిర్ణీత మొత్తం చెల్లిస్తే యజమానులకు సదరు నెంబర్ కేటాయిస్తారు. ఎవరైనా పోటీ పడితే వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ వేలం పాట అధికారిక వెబ్ పోర్టల్ parivahan.go.in లో ప్రతివారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ వారం ఎవరూ ఊహించని విధంగా హెచ్ఆర్ 88బీ 8888 నెంబర్ కు అమాంతం డిమాండ్ పెరిగింది. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం 45 మంది యజమానులు పోటీపడ్డారు. ప్రారంభ వేలం ధర రూ.50వేలు నిర్ణయించగా, ఒకరి తరువాత ఒకరు పెంచడం మూలంగా అది కాస్తా రూ.1.17 కోట్లకు చేరుకుని ఆగిపోయింది.

చిట్ట చివరి యజమానికి నెంబర్ కేటాయించారు. గత వారం ఇదే రాష్ట్రంలో హెచ్ఆర్ 22డబ్ల్యూ 2222 ఫ్యాన్సీ నెంబర్ కు రూ.37.91 లక్షలు పలకడం విశేషం. ఆ తరువాత ఇదే అత్యధికం. హెచ్ఆర్88 సీరిస్ కుండ్లి, సోనిపేట్ ఆర్టీఏ పరిధిలోకి వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో కేరళ రాష్ట్రంలో టెక్ బిలియనీర్ వేణు గోపాలకిష్ణన్ తన నూతన లాంబొర్గినీ యురస్ పెర్ఫామ్ నేట్ నెంబర్ ప్లేట్ కోసం రూ.45.99 లక్షలు చెల్లించారు. ఈ నెంబర్ ప్లేట్ ప్రారంభ ధర రూ.25వేలతో ప్రారంభమై రూ.45.99 లక్షలతో ముగిసింది. వేలం ముగిసిన తరువాత వేణుకు కేఎల్ 07డీజీ 0007 కేటాయించారు. హాలీవుడ్ సినిమాలలో జేమ్స్ బాండ్ సినిమాలకు 007 నెంబర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ క్రేజ్ తోనే ఈ నెంబర్ కోసం వేణు పోటీపడి ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు టీజీ 09హెచ్ 9999 నెంబర్ కు వేలం వేయగా రికార్డు స్థాయిలో రూ.22,72,222 అమ్ముడు పోయింది.

Latest News