మునుగోడు: మండలాలకు ఇంచార్జీలను ప్రకటించిన రేవంత్ రెడ్డి

విధాత, నల్గొండ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో మునుగోడు ఎన్నికల ప్రచారంపై చర్చించారు. నియోజకవర్గంలోని మండలాలకు ఒక్కో కాంగ్రెస్ సీనియర్‌ను ఇంచార్జిలుగా నియమించారు. నాంపల్లి మండలానికి దామోదర రాజనర్సింహ, చౌటుప్పల్ మండలానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడుకు బట్టి విక్రమార్క, మర్రిగూడకు శ్రీధర్ బాబు, చండూరుకు షబ్బీర్ అలీ, గట్టుప్పల్‌కు వీహెచ్ , నారాయణపురానికి ఇంచార్జిగా రేవంత్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి గీతారెడ్డిలు ఇంచార్జీలుగా పార్టీ ఎన్నికల ప్రచార […]

  • Publish Date - September 10, 2022 / 03:21 PM IST

విధాత, నల్గొండ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో మునుగోడు ఎన్నికల ప్రచారంపై చర్చించారు. నియోజకవర్గంలోని మండలాలకు ఒక్కో కాంగ్రెస్ సీనియర్‌ను ఇంచార్జిలుగా నియమించారు.

నాంపల్లి మండలానికి దామోదర రాజనర్సింహ, చౌటుప్పల్ మండలానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడుకు బట్టి విక్రమార్క, మర్రిగూడకు శ్రీధర్ బాబు, చండూరుకు షబ్బీర్ అలీ, గట్టుప్పల్‌కు వీహెచ్ , నారాయణపురానికి ఇంచార్జిగా రేవంత్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి గీతారెడ్డిలు ఇంచార్జీలుగా పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు.

మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జానారెడ్డి , జీవన్ రెడ్డిలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో బూత్‌కు పది మంది నాయకులను ఇన్చార్జిలుగా ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తారు.