దేశంలో 42% నిరుద్యోగం.. భారత్ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నట్లా?: రాహుల్‌

విధాత: 'దేశంలో 42 శాతం నిరుద్యోగం ఉంది. ఇలా ఉంటే భారత్ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నట్లా?' అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన కొందరు నిరుద్యోగ యువతతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇలాంటి వారిని ఏకం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం ఈ యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం […]

  • Publish Date - September 11, 2022 / 05:06 PM IST

విధాత: ‘దేశంలో 42 శాతం నిరుద్యోగం ఉంది. ఇలా ఉంటే భారత్ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నట్లా?’ అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన కొందరు నిరుద్యోగ యువతతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇలాంటి వారిని ఏకం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

శనివారం ఉదయం ఈ యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం కన్యాకుమారి జిల్లా మార్తాండం ప్రాంతంలో లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అనంతరం పాదయాత్రను కొనసాగించారు. తెలంగాణలోని మేడ్ పల్లి గ్రామం నుంచి వ్యక్తిగతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి యాత్రకు వచ్చిన ఊసయ్య.. రాహుల్ ను కలిశారు. కాసేపు ఆయనతో నడక సాగించారు.

శనివారం మధ్యాహ్నం మార్తాండం నుంచి కేరళ వెళ్లే మార్గంలో 3 కి మీ. పొడవైన జెండాతో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికారు. దీన్ని 1,857 మంది మోయగా.. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారని నేతలు తెలిపారు.