ఈటల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తనకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈటల ఇన్నిరోజులు అమరవీరుల కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.అసైన్డ్ ల్యాండ్ కొనొద్దని ఈటలకు తెలియదా అని నిలదీశారు. కొన్నానని స్వయంగా ఒప్పుకున్నా ఈటలను విచారణ లేకుండా జైల్‌కు పంపొచ్చని చెప్పారు.రెండు ఎకరాలు మాత్రమే ఉన్న ఈటలకు వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. […]

  • Publish Date - June 13, 2021 / 07:12 AM IST

హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తనకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈటల ఇన్నిరోజులు అమరవీరుల కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.అసైన్డ్ ల్యాండ్ కొనొద్దని ఈటలకు తెలియదా అని నిలదీశారు. కొన్నానని స్వయంగా ఒప్పుకున్నా ఈటలను విచారణ లేకుండా జైల్‌కు పంపొచ్చని చెప్పారు.రెండు ఎకరాలు మాత్రమే ఉన్న ఈటలకు వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నానక్ రాంగూడలో 15 ఎకరాలు ఎక్కడి నుంచి కొన్నారని నిలదీశారు. రావల్‌కోల్‌లో ఈటల కొడుకు పేరు మీద 200కోట్ల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాను చెప్పేవి అబద్ధమైతే హుజూరాబాద్ చౌరస్తాలో ఉరి తీయాలని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు.