" /> " /> " /> " />
500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు … రైతుల నిరసనకు రాహుల్ గాంధీ తన మద్దతును ట్వీట్ చేశారు
“ఖేత్-దేశ్ కీ రక్ష మెయిన్, టిల్-టిల్ మరే హైన్ కిసాన్, పార్ నా డేర్ హైన్ కిసాన్, ఆజ్ భీ ఖరే హైన్ కిసాన్” అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏమిటంటే రైతులు తమ వ్యవసాయం, దేశం యొక్క రక్షణ కోసం మరణించినప్పటికీ, వారు భయపడకుండా ఉంటారు, వారి వైఖరికి కట్టుబడి ఉంటారు.
ఢిల్లీ లో కొత్తగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె సందర్భంగా తిక్రీ బోర్డర్ వద్ద కూర్చున్న రైతులు. వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా, ఆరునెలల నుండి, వందలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల శిబిరాలలో వున్నారు. కేంద్రంతో పలు రౌండ్ల సమావేశాలు ప్రతిష్టంభనను పరిష్కరించడంవిఫలమవ్వడంతో ఆందోళన ఎంతకాలం కొనసాగుతుందో అస్పష్టంగా ఉంది. నవంబర్ 26, 2020 నుండి, నిరసనకారులు తమ పాయింట్లను వినిపించడానికి ఎండనకా వాననకా కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా దారిలో అనేక ప్రాణనష్టాలకు గురయ్యారు.
“అర్హులైన హక్కులను తిరిగి పొందడం కోసం 500 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం వారి ఏకైక డిమాండ్ – వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదని, పోరాటం ప్రారంభించి ఆరు నెలలు దాటిందని” కిసాన్ ఏక్తా మోర్చా నాయకులు బుధవారం ఉదయం ట్వీట్ చేశారు .ప్రాణాలు కోల్పోయిన అనేక మంది వ్యక్తుల ఫోటోలను వారు షేర్ చేశారు.”విజయం చెందేవరకు రైతులు ద్రుడ సంకల్పంతోనే వుంటారని” నొక్కి చెప్పారు.