నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలె.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్‌

విద్యుత్ సవరణల బిల్లు ను ఉపసంహరించుకోవాలె మంగళవారం నాటి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపుతామని ప్రకటన విధాత: కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సవరణలను ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంటు భవనానికి పేరు పెట్టడానికి, డాక్టర్ బి.అర్.అంబేద్కర్‌ను మించిన వారు లేరనీ, కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం […]

  • Publish Date - September 12, 2022 / 03:50 PM IST
  • విద్యుత్ సవరణల బిల్లు ను ఉపసంహరించుకోవాలె
  • మంగళవారం నాటి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపుతామని ప్రకటన

విధాత: కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సవరణలను ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు.

నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంటు భవనానికి పేరు పెట్టడానికి, డాక్టర్ బి.అర్.అంబేద్కర్‌ను మించిన వారు లేరనీ, కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించారు. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరుకు సంబంధించిన తీర్మానాలను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతామని సీఎం స్పష్టం చేశారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యాఖ్యలు

• కష్టపడి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.
• తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేంద్రం భయంకరమైనటువంటి అన్యాయం చేసింది.
• పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అనేక అంశాల పై తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది.
• ఇప్పుడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మొట్ట మొదటి కేబినేట్ మీటింగ్ లోనే తెలంగాణ గొంతు నులిమేసే విధంగా తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, మరీ ముఖ్యంగా సీలేరు పవర్ ప్లాంటును మన నుంచి వేరు చేసి ఆంధ్రలో కలిపింది.
• అప్పుడు నరేంద్ర మోడీని విమర్శించిన మొట్టమొదటి వ్యక్తిని నేనే కావచ్చని అనుకుంటున్నాను. ఆ సందర్భంలో ఈ దేశంలో అత్యంత నియంతృత్వ ప్రధాని మోడీ అని నేను విమర్శించాను.
• కేంద్రం తీరును నిరసిస్తూ… ఆ సందర్భంలో విమర్శలు వచ్చినా తెలంగాణ బంద్ కు పిలుపిచ్చాను. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని చాటుతూ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం బంద్ పాటించింది.
• మండలాలు కాకున్నా కనీసం పవర్ ప్లాంట్ ఇవ్వమని కోరుతూ, నా బాధను వ్యక్తంచ చేస్తూ కేంద్రానికి అనేక ఉత్తరాలు రాసాను. కానీ కేంద్రం కర్కషంగా వ్యవహరిస్తూ నా వినతులను లెక్కలోకి తీసుకోలేదు.
• కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని రోజు రోజుకు నీరుగారుస్తున్నది
• ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత. రాచరికం కాదు.
• కేంద్రం, రాష్ట్రం పరస్పరం సంప్రదించుకొని ముందుకుసాగాలని ఉమ్మడి జాబితాను రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు.
• పవర్ ఉమ్మడి జాబితాలో ఉంది.
• పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే వందమంది అధికార పార్టీ సభ్యులు వారిపైకి తెగబడి గొంతు నొక్కుతున్నారు.
• గందరగోళ పరిస్థితుల్లో బిల్లులను పాస్ చేసి ఇలాంటి చట్టాలు తెస్తున్నారు.
• మా పార్టీ సభ్యులు విద్యుత్ సవరణ బిల్లు పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
• ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మోటర్లకు మీటర్లు పెడితే రైతులంతా కలిసి వాటిని పీకేసీ నిరసన వ్యక్తం చేశారు.
• ఉత్తర ప్రదేశ్ లో మీటర్లకు వ్యతిరేకంగా ఇంకా గొడవలు జరుగుతున్నాయి.
• బిజెపి పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందా… ఒకరి పై ఒకరికి అపనమ్మకం ఉందా… గెజిట్ లో మాత్రం మీటర్లను బిగించడాన్ని గెజిట్ లో స్పష్టంగా ప్రకటించారు.
• వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అనే కాదు ఏ రకమైన విద్యుత్ కనెక్షన్ అయినా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ లేకుండా ఇచ్చేది లేదని గెజిట్ లో శాసించారు. దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి చంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు.
• విద్యుత్ సంస్కరణలు అని దానికో అందమైన పేరు, ముసుగు. అది సంస్కరణ కాదు. పాడు కాదు.
• పేదలను, రైతులను, కరెంటు వాడుకునే ప్రతీ ఒక్కరిని దోచుకునే దుర్మార్గం.
• సంస్కరణలు అనే ఒక అందమైన ముసుగు తొడిగి, ఈ సంస్కరణలు అమలుచేసిన వారికి 0.5 శాతం ఎఫ్.ఆర్.బి.ఎం అదనంగా ఇస్తామని చెప్పారు. ఇది అన్యాయమని నేను చెప్పా.
• ఆర్టీసిని అమ్మేయమని లెటర్ల మీద లెటర్లు వస్తున్నాయి. ఎవ్వరు ముందు అమ్మితే వారికి వేయి కోట్ల బహుమానమని కేంద్ర లెటర్లు పంపిస్తున్నది.
• మేం మొత్తం అమ్మేస్తున్నం కాబట్టీ మీరు కూడా అన్నీ అమ్మేయండనే పద్ధతిలో కేంద్రం వ్యవహరిస్తున్నది.
• ఈ మాయా మశ్చీంద్ర ఏంటి.. ఎవరు మోసం చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలియాలి.
• తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఇక్కడ తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్లు, కాగా జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లు. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2,126 యూనిట్లు. 1156 యూనిట్లు పెంచగలిగాం. కాగా పేదల కోసం, ప్రజల కోసం పనిచేసే కేంద్ర ప్రభుత్వ జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లు. కేంద్రం పెంచింది 209 యూనిట్లు. ఇది ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనత.
• 140 దేశాలను సర్వేచేసి ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటి అథారిటీ ప్రచురించిన నివేదికలో భారతదేశ ర్యాంకు 104. ఇది విశ్వగురు సాధించిన మహత్తర ఘనత.
• వ్యవసాయాన్ని అంతమొందించి కార్పోరేట్లకు కట్టబెట్టి, ఆ కార్పోరేట్ల కింద రైతులను కూలీలుగా చేయడమే మోడీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
• ప్రధాని, కేంద్రమంత్రులు అసమర్థత, అవివేకం వల్ల మొత్తం దేశ ఆహార రంగమే సంక్షోభంలో పడే పరిస్థితి తలెత్తింది.
• మహాత్ముడు పుట్టిన నేల మీద ఇలాంటి మరగుజ్జులు పుట్టారు.
• ఈ దేశంలో వేరే పార్టీలను కొనసాగనివ్వమని సాక్షుత్తు మునుగోడు సభలో కేంద్రమంత్రి అనడం ధర్మమేనా…
• 36 శాతం ఓట్లతోని కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీలు రాజ్యమేలుతున్నాయి.
• చరిత్రలో హిట్లర్, ముస్సోలిన్ లాంటి ఎందరో నియంతలు పోయారు.
• రాబోయే కాలంలో దేవుడు కూడా బిజెపి పార్టీని కాపాడడు.
• రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారు.
• తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు లేరు. ప్రభుత్వాన్ని పడగొడుతామంటున్నారు. ప్రతీ రాష్ట్రంలో ఇదే పెడబొబ్బలు.
• కేంద్ర ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేసింది.
• సైన్యం రిక్రూట్ మెంట్ లో ఇష్టంవచ్చినట్లు మార్పులు చేస్తే, దేశం అట్టుడుకింది. రైల్వే స్టేషన్ల దహనాలు, ధ్వంసాలు జరిగాయి.
• మీరు పోలీసులను తెచ్చి ఆ అల్లర్లను అణచివేయవచ్చు. కానీ యువకుల గుండెల్లో రగిలే మంటలను ఆర్పగలరా మీరు… అవి మిమ్మల్ని దహించవా..ఎందుకీ అహంకారం…
• ఉన్న విద్యుత్తును సరిగా వాడుకోలేని, వనరులన్నప్పటికీ విద్యుత్తును సృష్టించలేని అసమర్థ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం.
• మోడీ ప్రభుత్వం కార్పోరేట్ల కోసమే విద్యుత్ సంస్కరణలను అమలుచేస్తున్నది.
• కేంద్ర ప్రలోభాలకు లోనవకుండా మేం రైతులకు ఉచిత్ విద్యుత్ ఇచ్చేందుకే కట్టుబడి ఉన్నాం.
• మేకిన్ ఇండియా అంటారు… చైనా నుంచి అన్నీ దిగుమతి చేసుకుంటారు. ఈ మోసం ఇంకెన్ని రోజులు.
• విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి నేను విన్నవిస్తున్నాను. ఈ సంస్కరణలు దేశంలోని దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు, పేద రైతులకు హానికరం, నష్టదాయకమైనవి.
• విద్యుత్ సంస్కరణలని మీరంటున్న ఈ నిబంధనలను దేవుని కోసమైన మీరు ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి మేము కోరుతున్నాం.
• భూ సేకరణ చట్టం తెచ్చి వాపసు తీసుకున్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వాటినీ వాపస్ తీసుకున్నారు. క్షమాపణలు కూడా కోరారు. ప్రజలు మరో ఆందోళన చేపట్టకముందే మీరు తేరుకొని మా మాటలు స్వీకరించి విద్యుత్ సంస్కరణలను ఉపసంహరించాలని కోరుతున్నాం.
• విశ్వ గురువుకు పేదల మీద ప్రేమ ఉండాలి. వారి పొందుతున్న సౌకర్యాలను కట్ చేయడం కాదు.
• అణచివేతకు గురైన జాతుల గురించి అతి ఎక్కువగా తపించిన వ్యక్తుల్లో చెగువేరా కావచ్చు. నెల్సన్ మండేల కావచ్చు. ఆ కోవలో వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు.
• బాబా సాహెబ్ అంబేద్కర్ గారిది గొప్ప కాంట్రిబ్యూషన్.
• రాజ్యాంగ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు …. కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తేనే కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకోవాలని చెప్తే అంబేద్కర్ ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.
• కొత్త రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయకపోయినా సరే పార్లమెంట్ తీర్మానం ఆమోదించవచ్చనే నిబంధనను అంబేద్కర్ గారు పెట్టించారు. ఈ నిబంధనను అద్భుతంగా రూపొందించి రాజ్యాంగంలో పొదుపరిచారు. అదే చట్టం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
• కాబట్టీ కొత్త పార్లమెంటు భవనానికి పేరు పెట్టడానికి డాక్టర్ అంబేద్కర్ గారిని మించి వ్యక్తి ఈ దేశంలో లేనే లేడు.
• కేంద్రం తెచ్చిన కొత్త విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించే తీర్మానం, కొత్త పార్లమెంటు భవనానికి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టే తీర్మానాలను రేపు అసెంబ్లీలో పాస్ చేసి మిగతా కార్యక్రమాలను రేపు కొనసాగిస్తాం.