విధాత, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ తరువాత పోలీసులు ఈటల నేరుగా శామీర్‌పేట్‌లోని ఆయన ఇంటికి తరలించారు. సస్పెన్షన్ తరువాత ఈటల అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు.
కానీ పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుదామని ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఈటల వాహనాన్ని ఎక్కడా ఆపకుండా శామీర్‌పేట్‌లోని ఆయన ఇంటి వరకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో ఈటల మరి కొద్దిసేపట్లో అతని ఇంటి వద్దనే మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని ఆయన అనుచరులు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలోనే ప్రభుత్వం, రెవెన్యూ, రైతుల సమస్యలపై ఈటల ఓ 15 పేజీల ఓ ఛార్జ్ షీట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.