ముంచుకొస్తున్న ‘ఆప్’.. మోడీకి గుజరాత్ గుబులు

ఉన్నమాట: దాదాపు రెండున్నర దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారంలో కొనసాగుతున్న కమలం పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ రూపంలో ఆపద ముంచుకొస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్‌గా దృష్టి సారించింది. కొన్ని రోజుల నుంచి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ సహా ప్రముఖ నేతలందరూ రాష్ట్రంలో పర్యటిస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మోడీ షాలకు ముచ్చెమటలు పట్టించిన […]

  • Publish Date - September 13, 2022 / 03:42 PM IST

ఉన్నమాట: దాదాపు రెండున్నర దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారంలో కొనసాగుతున్న కమలం పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ రూపంలో ఆపద ముంచుకొస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్‌గా దృష్టి సారించింది. కొన్ని రోజుల నుంచి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ సహా ప్రముఖ నేతలందరూ రాష్ట్రంలో పర్యటిస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో మోడీ షాలకు ముచ్చెమటలు పట్టించిన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు ప్రస్తుతం గుజరాత్‌లో కనిపించడం లేదు. మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడం కోసం బీజేపీ నేతల పాచికలు ఈసారి పారేలా లేవు. ఎందుకంటే అల్పేష్ ఠాకూర్ ఓబీసీ నాయకుడు.

గుజరాత్ రాష్ట్రంలో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా అల్పేష్ ఠాకూర్ ఓబీసీ నాయకుడిగా ఎదిగారు. పాటిదార్ ఉద్యమం తర్వాత 2016లో ఓబీసీ ఏక్తా మంచ్‌ను స్థాపించారు. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2017లో రాధన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

అక్టోబర్ 2019 గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికలో రాధన్‌పూర్ స్థానం నుండి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. కాబట్టి ఈసారి కమలం పార్టీ కులాల లెక్కలు కుదిరేలా లేవు. కారణం ఆప్ హామీ ఇస్తున్న ఉచిత విద్య, వైద్యం, సామాన్య ప్రజలకు ఆ పార్టీ ఇస్తున్న భరోసాతో గుజరాత్ ప్రచార అంశాలు మారిపోతున్నాయి.

అందుకే ప్రధాని ఉచితాల ప్రస్తావన తెచ్చి ఉలిక్కిపడ్డారు. మరోవైపు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తున్నది. ఈ పరిణామాలు అన్నీ కమలనాథులను ముఖ్యంగా మోడీ, షాలను కలవరానికి గురిచేస్తున్నాయి. దీనికి తోడు కేజ్రీవాల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

తాజాగా అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న కేజీవాల్.. అక్కడి ఆటో రిక్షా డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. ఓ ఆటోవాలా ఢిల్లీ సీఎంను తన ఇంటికి భోజనానికి ఆహ్వనించగా.. స్వయంగా వచ్చి ఆటోలో తీసుకెళ్లాలని కేజీవాల్ కోరారు.

ఈ ఉదయం కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ.. ఢిల్లీలో తమ పార్టీకి మద్దతిచ్చినట్లుగానే గుజరాత్‌లో నూ ఆప్ ను గెలిపించాలని కోరారు. ఆయన ప్రసంగం అయిపోగానే.. ఓ డ్రైవర్ లేచి కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. “నీకు మీకు (కేజ్రీవాల్) చాలా పెద్ద అభిమానిని. పంజాబ్‌లో మీరు ఓ ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి భోజనం చేసిన వీడియోను సోషల్ మీడియాలో చూశాను. గుజరాత్‌లోనూ అలాగే చేస్తారా? మా ఇంటికి వస్తారా?” అని ఆ ఆటోవాలా అడిగారు.

దీనికి కేజ్రీవాల్ ఒప్పుకుంటూ.. ‘ఎన్ని గంటలకు రమ్మంటారు?’ అని అడిగారు. దీంతో ఆ ఆటోడ్రైవర్ సంతోష పడుతూ ‘రాత్రి 8 గంటలకు రండి’ అని పిలిచారు. ఆ వెంటనే కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “అయితే మీరు నేను ఉంటున్న హోటల్ల్‌కు వచ్చి మీ ఆటోలో నన్ను తీసుకెళ్తారా? నాతో పాటు మరో ఇద్దరు పార్టీ నేతలు కూడా వస్తారు మరి” అని చెప్పారు. దీనికి ఆ డ్రైవర్ ఆనందంగా సరే అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.