నల్గొండ జిల్లాలో ఎంపీడివోల బదిలీ

విధాత, నల్గొండ: నల్గొండ జిల్లాలోని పలువురు ఎంపీడీవోలను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఈ బదిలీల ప్రక్రియ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టినట్లుగా కనిపిస్తుంది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎనిమిది మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మునుగోడు ఎంపీడీవో బి. యాకుబ్ నాయక్‌ను పీఏ పల్లికి బదిలీ చేశారు. నల్గొండ ఎంపీడీవో వై. శ్రీనివాస్ రెడ్డిని మునుగోడుకు బదిలీ చేశారు. మర్రిగూడ ఎంపీడీవో కె.శేషుకుమార్‌ను చింతపల్లికి బదిలీ చేసి, […]

  • Publish Date - September 8, 2022 / 05:28 PM IST

విధాత, నల్గొండ: నల్గొండ జిల్లాలోని పలువురు ఎంపీడీవోలను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఈ బదిలీల ప్రక్రియ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టినట్లుగా కనిపిస్తుంది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎనిమిది మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

మునుగోడు ఎంపీడీవో బి. యాకుబ్ నాయక్‌ను పీఏ పల్లికి బదిలీ చేశారు. నల్గొండ ఎంపీడీవో వై. శ్రీనివాస్ రెడ్డిని మునుగోడుకు బదిలీ చేశారు. మర్రిగూడ ఎంపీడీవో కె.శేషుకుమార్‌ను చింతపల్లికి బదిలీ చేసి, నకిరేకల్ ఎంపీడీవో జె.వెంకటేశ్వరరావును మర్రిగూడ కు బదిలీ చేశారు.

చండూరు ఎంపీడీవో జి. బాలకృష్ణను గుర్రంపొడుకు బదిలీ చేసి, గుర్రంపూడ్ ఎంపీడీవో ఎస్. సుధాకర్‌ను చండూరుకు బదిలీ చేశారు. నాంపల్లి ఎంపీడీవో కే. రమేష్ ధీన్ దయల్‌ను నకిరేకల్‌కు బదిలీ చేసి, చింతపల్లి ఎంపీడీవో ఎల్. రాజును నాంపల్లికి బదిలీ చేశారు.