విధాత:ఈ సంక్షోభం లో ఏదో ఇంత డొనేషన్ ఇచ్చి తప్పించుకోకుండా ఆక్సిజను సిలెండర్ లను ప్రతి జిల్లాకు కేటాయించి వాటిని రీఫిల్ చేసుకొనేకి ఒప్పందాలు చేసుకుని ఆక్సిజన్ బ్యాంకు ల ద్వారా ఇంటిలోకే అవసరమైన వారికి ఇవ్వాలనుకున్నాడంటే అది నిజంగా ధైర్యంతో కూడిన నిర్ణయం…
ఇది మనుషులకు ఒక ధైర్యాన్నిస్తుంది.. నాకు అత్యవసరమైతే వాళ్ళకు ఆక్సిజను కోసం ఫోను చేయచ్చు అనే భరోసానిస్తుంది.ఇది ఎంతో పెద్ద నెట్వర్కు ఉన్న ప్రభుత్వాలు చేయవలసిన పని.. అది ఒక మెగాస్టార్ చేస్తున్నాడంటే అభినందించాల్సిందే..ఆక్సిజన్ ప్లాంట్లు పది ఆసుపత్రి లకు అందరిచ్చినట్లు ఇచ్చింటే చచ్చేవాళ్ళం.. దానికి షెడ్లు కట్టేకి, మూడు షిఫ్టులలో మనుషులు పెట్టి వాళ్ళకు జీతాలిచ్చి అవి మెయింటైన్ చేయాలంటే ఆసుపత్రి లకు మెంటలే… అలా కాకుండా ఆసుపత్రి కి రాకముందే ఆక్సిజన్ ఇంటివద్దకే అంటే ఆసుపత్రి లమీద బర్డన్ తగ్గించినట్లే…
ఏదో ఇచ్చామా,.పబ్లిసిటి చేసుకున్నామా అని కాకుండా వాటి పంపిణీ, నిర్వహణ, మంది, మార్బలం అంటే ఒక వ్యవస్ధను నడపడం., దానికి చిత్తశుద్ధి ధైర్యం కావాల.. ఇటువంటి సమయంలో అటువంటి అసాధారణ నిర్ణయం తీసుకున్నాడంటే తప్పకుండా అభినందించాల్సిందే…
ఇన్నాళ్ళు ప్రభుత్వమే సరఫరా కోసం మల్లాగుల్లాలు పడింది., ఇపుడు కొంచెం వెసులు బాటు వస్తోంది.. అటువంటి సమయంలో ఇలాంటి ప్రణాళికతో రావడం, ఆదర్శమే,,, ఇలాగే కమ్యూనిస్టు పార్టీ CPM, కూడా తమ కార్యాలయాలని కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాయి.. ఇలాగే అందరూ పెద్ద ఇండస్ట్రియలిస్టులు, దిగ్గజాలు చిరు, CPM బాటలో ముందుకు రావాల…
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా అటో ఇటో … అని ముందుకు రావడం అభినందనీయం,,
స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే
ధూర్తులే అసురులై ఉరక లేస్తుంటే
చినుకు చినుకున కురిసెను నీ కల
మనస్సు మనస్సున రగిలెను జ్వాలలా
మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి
భువిని చరితను నిలుపును కదా నీ కృషి
ఆక్సిజను తో ఊపిరూదే నీ బంధమే
నిలిచిపోరాదా మా గుండెలో చిరు బంధమై,,,
We Love You Chiranjeevi sir for your right decision at right time…. Let it follow by others,…
Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.