రేపటి నుంచి దేశంలో అగ్గిపెడతాం.. పెట్రోల్ రేట్లు తగ్గించేది లేదు : సీఎం కేసీఆర్

విధాత : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు.. సీఎం కేసీఆర్ ఆది వారం ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీనీ తీవ్రంగా విమర్శించారు. ఒక్కసారి కేసీ ఆర్ ను టచ్ చేసి చూడు మేమేంటో చూపిస్తామంటూ సవాల్ విసిరారు.. పార్లమెంట్ లో దద్దరిల్లేటట్లు చేస్తం.. తెలంగాణ కేబినేట్.. శాసన సభ.. శాసన మండలి మొత్తం ఢిల్లీ పోయి గొడవ చేస్తం..బీజేపీ ద్వంద వైఖరిని ఖండిస్తామంటూ సీఎం కేసీఆర్ ఫైర్ […]

  • Publish Date - November 7, 2021 / 03:58 PM IST

విధాత : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు.. సీఎం కేసీఆర్ ఆది వారం ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీనీ తీవ్రంగా విమర్శించారు. ఒక్కసారి కేసీ ఆర్ ను టచ్ చేసి చూడు మేమేంటో చూపిస్తామంటూ సవాల్ విసిరారు..

పార్లమెంట్ లో దద్దరిల్లేటట్లు చేస్తం.. తెలంగాణ కేబినేట్.. శాసన సభ.. శాసన మండలి మొత్తం ఢిల్లీ పోయి గొడవ చేస్తం..బీజేపీ ద్వంద వైఖరిని ఖండిస్తామంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ దమ్ముంటే యసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తా మని కేంద్రం నుంచి చెప్పించండి.. కాయకొరుకుడు మాటలు బంద్ చేయండి..ప్రాజెక్ట్ లు బంద్ చేయాలని బండి సంజయ్ లెటర్ ఇవ్వలేదా..మీరు ధాన్యం కొనుగోలు చేస్తామంటే..వరి విత్తనాలు, ఎరువులు ఇస్తాం..ధాన్యం సేకరిస్తామని అన్నారు.

2018లో 107 స్థానాల్లో డిపాజిట్ పోయిన పార్టీ..ఇన్నిరోజులు మాట్లాడితే ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతున్నాయ్ అని ఉరుకున్నాం..ఇప్పుడు విడిచిపెట్టేది లేదు.. బజార్లో నిల బెడుతామన్నారు.

మీ రాష్టాలలో దళిత బంద్ అమలు చేస్తున్నారా..మీ మొఖానికి 2వేల పించన్ ఇస్తున్నారా.. క్రూడాయిల్ ధరలు పెరగకున్నా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం అన్యాయం కదా…కొండంత పెంచి పిసరంత తగ్గించి పెద్ద పీకి పడగొట్టారని బిల్డప్ ఇస్తారా అని దుయ్యబట్టారు.

మీ పరిపాలనలో జీడీపీ పడిపోయింది.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ కన్నా వెనుక పడిపోయింది.. నన్ను తిట్టినా నేను పట్టించు కోలేదు.. నేడు రైతులను వరి పెట్టమని తప్పుదారి పట్టిస్తున్నారు అని..ఆగం చేస్తున్నారని మాట్లాడొచ్చా.. ఎవరి మెడలు వంచుతా వ్.. మెడను నాలుగు ముక్కలు చేస్తాం..రైతుల జోలికి, ప్రజల జోలికి వొస్తే సహించేది లేదని అన్నారు.

నిత్యావసర ధరలు పెంచారు..రవాణా చార్జీలు పెరిగి ధరలు పెరిగాయి..సామాన్యుల జీవితాలు ఆగమై పోయాయి..హిందు ముస్లీం లొల్లి పెట్టుకుంటూ…కాలం వెళ్లబుచుతున్నారు..బార్డర్ లో చైనా వాళ్ళు ఊర్లు కడుతున్నారు..ఏం చేస్తున్నారు.. మీ పార్టీ ఎం ఉద్దరిస్తుందని మండిపడ్డారు.

హర్యానా ముఖ్యమంత్రి రైతుల మీద దాడి మీద చేయాలని చెప్తారా..మొత్తం మార్కెట్ లను రద్దు చేస్తారా..3 ఎకరాల రైతు ధాన్యం ను కర్ణాటక, మహారాష్ట్ర లో అమ్ముతారా.. పార్లమెంట్ లో లొల్లి చేస్తాం..జిల్లా కేంద్రంలో, ఢిల్లీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు, జడ్పీ చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు.

పంజాబ్ లో ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నారు..మరి తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరు..ఇది అన్యాయం కదా..ఒక వారం రోజులు చూద్దాం..కేంద్రం తీసుకుంటే వరి వేద్దాం.. లేని పక్షంలో వేరే పంటలు వేసుకోవాలి..కేంద్రం మొన్ననే చెప్పింది..ఉప్పుడు బియ్యం తీసుకోమని చెప్పింది కావున.. తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు…తెలంగాణ తీసికొచ్చినం. ప్రజలను సరైన విధానంలో తీసుకెళ్లే బాధ్యత లేదన్నారు.

ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే ఒరిగేది ఏమి లేదు..మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.. ఒక్క ఓటమితో భయపడేది ఏమి లేదు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దిగజారి మాట్లాడారు.. ఇది సరికాదు..కేంద్రం బియ్యం తీసుకో మని చెప్పుతుంది..

ఇక్కడి బీజేపీ నాయకులు trs ప్రభుత్వన్ని అప్రతిష్ట పాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు.. 100 శాతం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి పోరాటం చేస్తాం..అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నాం..

రాయచూరు ఎమ్మెల్యే.. తెలంగాణ లో చేపడుతున్న సంక్షేమ పథకాలు కర్ణాటక లో అమలు చేయాలని , లేదా మమ్మల్ని అందులో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.. అంటే తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకోవచ్చు..పెట్రోల్, డీజిల్ మీద మేము తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క పైసా టాక్స్ పెంచలేదు..అందుకే తగ్గించే ప్రసక్తే లేదు.. పెట్రోల్ ఉత్పత్తుల పై సెస్ ను కేంద్రం రద్దు చేయాలి..