Site icon vidhaatha

తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఉత్తమ్ దంపతులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతిలు సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పద్మవతి ఉత్తమ్ పుట్టిన రోజు పురస్కరించుకుని వారు శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం పద్మావతి ఉత్తమ్‌లు గెస్ట్‌హౌజ్‌లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ తన సతీమణి పద్మావతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గం ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, వారి ప్రేమాదరణలు మాకు ఇలాగే కొనసాగాలని పద్మావతి, ఉత్తమ్‌లు ఆకాంక్షించారు.

Exit mobile version