Site icon vidhaatha

3వేలకు పైనే మరణాలు

కొత్తగా 3.86లక్షల మందికి పాజిటివ్‌

దిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయానికి యావత్ భారతావని చిగురుటాకులా వణికిపోతోంది. చాపకింద నీరులా దేశం నలుమూలలకు విస్తరించిన కొవిడ్‌.. లక్షల మందిపై ప్రతాపం చూపిస్తోంది. నిత్యం వేల మందిని బలితీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలు వైరస్‌ ఉద్ధృతిని కళ్లకు కడుతున్నాయి. తాజాగా మరో 3.86లక్షల మంది కొవిడ్‌ బారినపడగా.. వరుసగా మూడో రోజు 3వేల మందికి పైనే మృత్యువాతపడ్డారు.

కొవిడ్‌ గుప్పిట్లో రాష్ట్రాలు..

కొవిడ్‌ మహమ్మారితో మహారాష్ట్ర వణుకుతోంది. నిన్న అక్కడ 66వేలకు పైన కొత్త కేసులు, 771 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళ, కర్ణాటక, ఉత్తప్రదేశ్‌, దిల్లీల్లో అత్యధిక రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. కేరళలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 38,607 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 35వేల కేసులు.. 270 మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో గడిచిన 24 గంటల్లో 24వేలకు పైగా కొత్తగా కరోనా బారినపడగా.. 395 మంది మృత్యువాతపడ్డారు..

Exit mobile version