Site icon vidhaatha

మునుగోడును కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది: పాల్వాయి స్రవంతి

విధాత, నల్గొండ: కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం మునుగోడును తిరిగి గెలుచుకుంటామని పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడు కాంగ్రెస్ గడ్డ, కాంగ్రెస్ అడ్డ అని, చరిత్రలో కాంగ్రెస్, కమ్యూనిస్టు లు, ఒకసారి మాత్రమే టీఆర్ఎస్ ఈ స్థానంలో గెలిచాయన్నారు. మిగతా పార్టీలకు ఇక్కడ స్థానం లేదన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్‌లు కుమ్మక్కయి ఎన్నికలు తెచ్చాయని, కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజీనామా చేయగానే వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన టీఆర్ఎస్, బీజెపితో కలిసి ఉప ఎన్నికల కారణమైనదన్నారు. ప్రజాస్వామ్యానికి ఖూనీ చేస్తానికే రెండు పార్టీలు ఎన్నికలు తెచ్చి కాంగ్రెస్ లేదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ లు ధన బలము అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాయని విమర్శించారు. అంతిమంగా ప్రజా ఆశీర్వాదం ప్రజాబలంతో ఆ రెండు పార్టీల అప్రజాస్వామిక విధానాలను తిప్పి కొట్టి కాంగ్రెస్ ను మునుగోడు ప్రజలు మళ్లీ గెలిపిస్తారన్నారు.

Exit mobile version