Man Escapes From Alligator Attack | భూమి మీద నూకలున్నాయి..మొసలికి చిక్కి బతికాడు

సరస్సులో ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి (ఎలిగేటర్) దాడి చేసింది. అతను ఏమాత్రం భయపడకుండా వేగంగా ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

man-escapes-from-alligator-attack-while-swimming-in-lake-viral-video

విధాత : భూమి మీద నూకలుంటే..ఆయుష్షు గట్టిదైతే మనిషి ప్రాణానికి ఏ ఆపద వచ్చినా..అవన్ని అతని ముందు దిగదుడుపే అవుతాయంటారు. అలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ సరస్సు నీళ్లలో ఈత కొడుతున్న వ్యక్తి వద్దకు మొసలి(ఎలిగేటర్ జాతి) వేగంగా వచ్చి దాడి చేసింది. ఆ వ్యక్తి అంతే వేగంగా తేరుకుని మొసలికి చిక్కకుండా వేగంగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరాడు.

మొసలి అతడిని వెంబడించినా ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా వేగంగా ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు..అతను అదృష్టవంతుడని..భూమిపై ఇంకా నూకలు ఉన్నందునే నీటిలో మొసలి బారిన పడి మరి తప్పించుకుని బతికిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.