ఇంకొద్ది రోజుల్లోనే: రింగ్ ఆఫ్ ఫైర్: భారత్‌లో కనిపిస్తుందా?

విధాత,న్యూఢిల్లీ: అంతు చిక్కని, అంతే లేని అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరానికి ఇవి తొలి సూర్యగ్రహణ రోజులు. ఈ నెల 10వ తేదీ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. […]

  • Publish Date - June 2, 2021 / 11:50 AM IST

విధాత,న్యూఢిల్లీ: అంతు చిక్కని, అంతే లేని అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరానికి ఇవి తొలి సూర్యగ్రహణ రోజులు. ఈ నెల 10వ తేదీ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతాయి.

భారత్‌లో ఈ సూర్యగ్రహణం మధ్యహ్నం ఒంటిగంటా 42 నిమిషాలకు ఆరంభమౌతుంది. సాయంత్రం 6:41 నిమిషాలకు ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది. టైమ్ అండ్ డేట్ అనే వెబ్‌సైట్ వేసిన అంచనాల ప్రకారం.. భారత్‌లో ఇది కనిపించదు. రష్యా, గ్రీన్‌ల్యాండ్, కెనడా ఉత్తర ప్రాంతంలల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఆసియా ఉత్తర ప్రాంత దేశాలు, ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్, యూరప్, అమెరికా దేశాల్లోనూ పాక్షికంగా దర్శనమిస్తుందీ సూర్యగ్రహణం.
పాక్షిక సూర్యగ్రహణం కావడం వల్ల భూమి ఛాయ సూర్యడి మీదుగా ప్రయాణించినప్పుడు దాన్ని పూర్తిగా కప్పేయదు. ఫలితంగా రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడుతుంది. చుట్టూ భగభగ మండే అంచులు. మధ్య గ్రహణ ఛాయతో సూర్యుడు కనిపిస్తాడు. ఈ అద్భుతాన్ని.. ఆయా దేశాలు చూడగలరు. దీని తరువాత డిసెంబర్ 4వ తేదీన మరోసారి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా భారత్‌లో కనిపించే అవకాశాలు లేవని స్కైవాచర్స్ చెబుతున్నారు.