Site icon vidhaatha

SC Ruling Telangana Teachers Retirement |  టీచర్లకు టెట్ టెంపరేచర్.. కోర్టును ఆశ్రయించనున్న ఉపాధ్యాయ సంఘాలు

జనగామ, సెప్టెంబర్ 11 (విధాత) :

SC Ruling Telangana Teachers Retirement | గత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు లేకుండా డిస్టిక్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికై 30 సంవత్సరాలుగా సర్వీస్ చేసి రిటైర్‌మెంట్ దగ్గర పడుతున్న సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు టెట్ తప్పనిసరి అనడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెంపరేచర్ మొదలయ్యింది. ప్రభుత్వాలు తీసుకొచ్చే కొత్త కొత్త జీవోలతో ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ బడుల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించేందుకు మొన్నటికి మొన్న (ఎఫ్‌ఆర్‌ఎస్) ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అమలు చేయడంతో ఉరుకుల పరుగుల జీవితంతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికై 30 సంవత్సరాలు సర్వీస్ అందించి రిటైర్‌మెంట్ దగ్గర పడుతున్న సమయంలో టెట్ నిబంధనలు తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో జిల్లావ్యాప్తంగా 801 ముంది ఉపాధ్యాయులుకు టెట్ టెంపరేచర్ మొదలయ్యింది.

కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం

రెండు సంవత్సరాల సమయంలో తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని లేకపోతే సర్వీస్ నుండి తొలగిస్తామని అనడంతో ఉపాధ్యాయులు భయం మొదలైంది. సర్వీస్ అయిపోయే సమయంలో ఉపాధ్యాయులకు పరీక్షలు ఏంటంటూ విమర్శిస్తున్నారు. ప్రమోషన్లకు మాత్రమే టెట్ నిబంధనలు అమలు చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత డీఎస్సీ ల ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు అసలు టెట్ అవసరం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాలను విమర్శిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2119 మంది టీచర్లు పనిచేస్తుండగా, అందులో 1336 మంది స్కూల్ అసిస్టెంట్లు పీజీహెచ్ఎంలు 76, పీఎస్ హెచ్ఎంలు 101, స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ 142, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 197, స్కూల్ అసిస్టెంట్ సోషల్ 155, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 151, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 143, అసిస్టెంట్ హిందీ 122, కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ 51, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ 144, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 1, దీంతోపాటు 789 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 8 మంది, లాంగ్వేజ్ పండిట్ హిందీ 8 మంది, లాంగ్వేజ్ పండిట్ తెలుగు 11 మంది, డ్రాయింగ్ 2, క్రాఫ్ట్ 1 టీచర్ పనిచేయగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 2119 పని చేస్తున్నారు.

2011 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకం కావాలంటే టెట్ తప్పనిసరి ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో అప్పటినుండి ఇప్పటివరకు గత ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తున్నారు. 2011 సంవత్సరం నుండి ఇప్పటివరకు 250 మంది అభ్యర్థులు టెట్ ద్వారా ఉపాధ్యాయులుగా నియామకం అయ్యారు. గత డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులతో పాటు కలిపి మొత్తం 2119 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా టీచర్ల టెట్ తప్పనిసరి అనడంతో అప్పటినుండి ఇప్పటివరకు 800 మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించారు. రిటైర్‌మెంట్ సర్వీస్ దగ్గర పోవడంతో ఐదు సంవత్సరాలలోపు వారికి 268 మంది ఉపాధ్యాయులకు టెట్ మినహాయించారు. మరో 801 మందు ఉపాధ్యాయులు టెట్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంది . ఏది ఏమైనప్పటికీ ఉపాధ్యాయులకు టెట్ అనేది సరైనది కాదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.

Exit mobile version