ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

విధాత: ఉపాధ్యాయ దంపతుల ఆందోళనకు తలొగ్గిన తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు వారి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బదిలీలకు స్కూల్ ఎడ్యుకేషన్ అదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ దంపతులు గత కొంతకాలంగా బదిలీల కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రభుత్వం వారికి ఊరట నిచ్చేలా స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిలిపేసిన 12జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులను బదిలీ […]

  • Publish Date - January 27, 2023 / 01:48 AM IST

విధాత: ఉపాధ్యాయ దంపతుల ఆందోళనకు తలొగ్గిన తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు వారి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బదిలీలకు స్కూల్ ఎడ్యుకేషన్ అదేశాలు జారీ చేసింది.

ఉపాధ్యాయ దంపతులు గత కొంతకాలంగా బదిలీల కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రభుత్వం వారికి ఊరట నిచ్చేలా స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో నిలిపేసిన 12జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులను బదిలీ చేయాలని ఆదేశాలిచ్చారు. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నేడు ప్రారంభం కానున్నది.

Latest News