మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కృషికి తగిన ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం లభిస్తుంది. మీ ప్రతిభకు, సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప ఒడిదుడుకులు ఉన్నపటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా, ఆదాయం కూడా పెరగడంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో స్వల్ప ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం సంతృప్తికరమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో గతంలో ఉన్న ఇబ్బందులు తొలగి స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నా, గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభం పొందవచ్చు. వృథా ఖర్చులు నియంత్రించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా కొనసాగుతాయి. జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఉద్యోగంలో పురోగతి ఉన్నప్పటికీ స్థిరత్వం లోపిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. వ్యాపారులు తమ వ్యాపారంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. నిరాశ, నిస్పృహలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం మంచిది. పేమ వ్యవహారాల్లో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎంత సహనంతో ఉన్నా వాదనలు, ఘర్షణలు తప్పక పోవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది. డబ్బు కొరత ఉండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరమైన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక విషయాల్లో వివేకంతో వ్యవహరించాలి. మీ సమర్థతతో వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ప్రయాణాలు ఆహ్లాదంగా సాగుతాయి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. వ్యాపారం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించవచ్చు. ఉద్యోగంలో శ్రద్ధతో పనిచేయాలి. అనవసర విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ప్రభుత్వ ఉద్యోగులు మంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఇరువురు పరస్పర అభిప్రాయాలు గౌరవించుకోవాలి. కుటుంబంలో ఉద్రిక్త భరితమైన వాతావరణం ఉంటుంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం తమ తమ రంగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు శ్రేష్ఠమైన సమయం నడుస్తోంది. నూతన వ్యాపార ఆరంభానికి అనువైన సమయం. పలు మార్గాల నుంచి పెట్టుబడులు, ధనలాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పరిస్థితి నిలకడగా ఉంటుంది. పనిప్రదేశంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందడం సంతృప్తి కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం సానుకూల పరిణామాలు ఉంటాయి. ఉద్యోగులు చక్కని ప్రణాళికతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభించవచ్చు. విదేశీయానానికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి. సరైన ప్రణాళిక, ముందుచూపుతో వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వృద్ధి స్పష్టంగా ఉంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషకరమైన సందర్భాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం విశేషంగా యోగిస్తుంది. ఉద్యోగంలో విజయం సిద్ధిస్తుంది. గౌరవప్రదమైన స్థానం సంపాదిస్తారు. వృత్తి పరంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. వ్యాపారులకు ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ లభిస్తుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కలిగిస్తుంది. అనేక మార్గాల నుంచి ధనాదాయాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గడం, ఆదాయం పెరగడంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు తొలగుతాయి. అవివాహితులకు కల్యాణయోగం ఉంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల గణనీయమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి సమయం నడుస్తోంది. అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పిత్రార్జితం ద్వారా లాభాల పొందవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఉండవచ్చు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం ఆశించిన ఫలితాల కోసం గట్టి కృషి చేయాలి. ఉద్యోగులు తమ నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చు. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల అధికారుల మెప్పు పొందవచ్చు. వ్యాపారంలో ఖర్చులు తగ్గించుకుని ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించాలి. వ్యాపారంలో పోటీ పెరిగినప్పటికీ సమయానుకూల నిర్ణయాలతో స్థిరమైన ప్రగతి సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలెక్కుతాయి.
