అమరావతి : ఏపీ సీంఎం చంద్రబాబు ప్రతిపాదించిన పాపులేషన్ పాలసీ హాస్యాస్పదంగా ఉందని, ఉన్న బిడ్డలకే రాష్ట్రంలో దిక్కులేదు అని, ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా ? అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల మండిపడ్డారు. మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా ? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు అని, రాష్ట్రంలో ఎన్నికలలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు అని, మీరు, జగన్ కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు అని షర్మిల విమర్శించారు.
సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు అని ఆరోపించారు. ఇసుక మాఫియా, భూమఫియాలు రాష్ట్రాన్ని దోచుకుంటూ బిడ్డలను కనమని ప్రజలకు చెప్తే ఎలా అని చంద్రబాబు పాపులేషన్ పాలసీని తప్పుబట్టారు.
ఇవి కూడా చదవండి :
Donkey Farming | మీకు తెలుసా…గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
Sundar Pichai : వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
