4.80 ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు దేనికి చేశారు?

తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చిన ఆదాయం మొత్తం రూ. 5,45,085.89 కోట్లు కాగా చేసిన అప్పుల‌కు చెల్లించిన అస‌లు, వ‌డ్డీ క‌లిసి కేవ‌లం రూ. 65,017.87 కోట్లు మాత్ర‌మే. మిగతా 4.80 ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు దేనికి చేశార‌న్న విమ‌ర్శ‌లు  వెలువ‌డుతున్నాయి. ఉద్యోగుల‌కు, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగులు, కాంట్రాక్ట‌ర్ల‌కు, విద్యార్థుల‌కు, ఆసుప‌త్రుల‌కు చెల్లించాల్సిన ఆరోగ్య‌శ్రీ‌ బిల్లులు ఇలా అన్ని క‌లిపి దాదాపు ల‌క్ష కోట్ల‌కు పైగానే బ‌కాయిలున్నాయ‌ని స‌మాచారం. బ‌కాయిలు చెల్లించ‌లేదు, రైతు భరోసా పూర్తి చెల్లింపులు చేయ‌లేదు... పెద్ద ప్రాజెక్ట్‌లు చేప‌ట్టలేదు... మ‌రి దేనికి రూ.4.80 ల‌క్ష‌ల కోట్లు చెల్లించార‌న్నప్ర‌శ్నస‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్న‌ది.

4.80 ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు దేనికి చేశారు?
  • తెలంగాణ ప్రభుత్వానికి త‌గ్గుతున్న రాబ‌డి.. పెరుగుతున్న ఖ‌ర్చులు
  • రెండున్న‌రేళ్ల‌లోనూ కుదురుకోని ఆర్థిక ప‌రిస్థితి
  • సొంత ఆదాయాన్ని పెంచ‌డంలో రేవంత్ స‌ర్కార్ ఫెయిల్?
  • కాగ్‌కు ఆల‌స్యంగా స‌మ‌ర్పించిన లెక్క‌ల్లో స్ప‌ష్టం
  • తెచ్చిన అప్పుల‌తో ఆస్తుల సృష్టిస్తున్న ఆస్తులేవి?

హైద‌రాబాద్‌, విధాత‌:

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మిగులు నిధుల‌తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్ప‌గిస్తే.. కేసీఆర్ అప్పుల పాలు చేశార‌ని, రాష్ట్రాన్ని దోచుకుతిన్నార‌ని తీవ్రంగా  . actఝళఝేదని ఆయన అన్నారు. ఈ పరిస్ు ఎలాంటి అీస్తున్నారని ఆయన వాపోయారు. ది లఆరోపించిన కాంగ్రెస్ తాను అధికారంలోకి వచ్చి రెండున్న‌రేళ్లు అయినా ర‌వ్వంతైనా మెరుగుప‌రిచ‌లేద‌న్న అభిప్రాయం ఈ రెండున్న‌రేళ్ల‌లో రాష్ట్ర‌ప్ర‌భుత్వం కాగ్‌కు స‌మ‌ర్పించిన బ‌డ్జెట్ ప‌త్రాల‌ను ప‌రిశీలిస్తే వ్య‌క్తం అవుతున్న‌ది. ఏటేటా ఖ‌ర్చులు పెరుగుతున్నాయి కానీ రాబ‌డి మాత్రం ఖ‌ర్చుల‌కు త‌గిన విధంగా పెర‌గ‌డం లేద‌ని కాగ్ ప‌త్రాల్లో తేట తెల్లం అవుతున్న‌ది. బ‌డ్జెట్ ప‌త్రాల‌లో వేస్తున్న అంచ‌నాల‌కు వాస్త‌వ రాబ‌డికి మ‌ధ్య భారీ తేడా ఉంటుంన్న‌ది. కేసీఆర్ హ‌యాంలో 90 శాతం, 100 శాతం ఉన్న రాబ‌డి కాంగ్ర‌స్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత 78 శాతం, 75 శాతం, 79 శాతానికి ప‌డిపోయినట్టు కాగ్‌కు సమర్పించిన లెక్కలను గమనిస్తే అర్థమవుతున్నది.

ఆదాయం త‌గ్గ‌డంలో అప్పుల వేట‌లో రేవంత్ స‌ర్కార్ జెట్ స్పీడ్‌లో ఉంద‌ని కాగ్ లెక్కలు పేర్కొంటున్నాయి. కేసీఆర్ పాల‌న‌లో 2022–203 ఆర్థిక సంవ‌త్స‌రంలో అసెంబ్లీ ఆమోదం పొందిన అప్పులో 62 శాతం మాత్ర‌మే తీసుకుంటే… 2023–24 ఆర్థిక సంవ‌త్స‌రంలో డిసెంబ‌ర్ వ‌ర‌కు కేసీఆర్ స‌ర్కారు, డిసెంబ‌ర్ త‌రువాత మార్చి 24 వ‌ర‌కు రేవంత్ రెడ్డి పాల‌న క‌లిపి అసెంబ్లీ ఆమోదం పొందిన రుణం కంటే అధికంగా తీసుకున్నట్టు తేలుతున్నది. దీంతో 104 శాతంగా నాటి రుణం ఉన్న‌ది. 2024–2025లో 94 శాతం రుణం తీసుకోగా, 2025–2026లో 141 శాతం రుణం రేవంత్ స‌ర్కారు తీసుకున్న‌ది. చేసిన అప్పుల‌ను స‌మ‌ర్థించుకుంటున్నరేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తాము కేసీఆర్ ప్ర‌భుత్వంలో అధిక వ‌డ్డీకి తెచ్చిన అప్పుల‌ను త‌క్కువ వ‌డ్డీకి తీసుకు వ‌చ్చి తీరుస్తున్నామ‌ని చెప్పింది. కానీ కాగ్‌కు స‌మ‌ర్పించిన ప‌త్రాల్లో ఈ లెక్క‌ల్లో ఎక్క‌డా స్ప‌ష్ట‌త లేదు. 2023 డిసెంబర్ నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కాగ్‌కు సమర్పించిన బడ్జెట్ పత్రాల ప్రకారం 2026 మార్చి వరకు వడ్డీ, అసలు కలిపి చేసిన రీపేమెంట్ రూ.65,017.87 కోట్లు మాత్రమే. కానీ తెచ్చిన అప్పు మాత్రం రూ.1,37,522.83 కోట్లు. అయితే రేవంత్ రెడ్డి తాను చేసిన అప్పుల‌ను స‌మ‌ర్థించుకోవ‌డం కోసం కేసీఆర్ ఎక్కువ వ‌డ్డీల‌కు తెచ్చిన అప్పులు తీర్చ‌డానికే తాను త‌క్కువ వ‌డ్డీలు అప్పులు చేస్తున్నాన‌ని చెప్పారు. కానీ బ‌డ్జెట్ అప్పుల రీ పేమెంట్ ను ప‌రిశీలిస్తే ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా క‌నిపిస్తోంది.

2023 డిసెంబ‌ర్ నుంచి 2026 మార్చి వ‌ర‌కు చేసిన అప్పు- తీర్చిన అప్పు- కాగ్ లెక్క‌ల ప్ర‌కారం

సంవ‌త్స‌రం           అప్పు           చెల్లింపులు(రూ. కోట్ల‌లో)

2023-24           రూ. 11,438.28           రూ.8,650.18

(2023 డిసెంబ‌ర్ నుంచి మార్చి 2024 వ‌ర‌కు)

2024-25           రూ.48,322.20           రూ.26,688.27

2025-26           రూ.77,762.35           రూ.29,679.42

మొత్తం           రూ.1,37,522.83           రూ.65,017.87

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అప్పులు చేయ‌డంపై చూపిస్తున్న శ్ర‌ద్ధ.. ఆదాయం పెంచడంపై చూపించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. కాగ్‌కు స‌మ‌ర్పించిన లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే సొంత ఆదాయ వ‌న‌రుల విషయంలో వేసిన అంచ‌నాల‌కు, వ‌స్తున్న ఆదాయానికి మ‌ధ్య పెద్ద అంత‌రం క‌నిపిస్తోంది. ఫ‌లితంగా అధికంగా అప్పు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. తెలంగాణ‌కు సాఫ్ట్‌వేర్‌ ఇండ‌స్ట్రీ, మెడిక‌ల్ హ‌బ్‌, ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ త‌రువాత ప్ర‌ధాన‌ గ్రోత్ ఇంజిన్ రియ‌ల్ ఎస్టేట్‌, భ‌వ‌న నిర్మాణ రంగం. కానీ ఈ గ్రోత్ ఇంజ‌న్ కుదేలైంది. కొనుగోలుదారులు త‌గ్గారు. అనేక భ‌వ‌న నిర్మాణ సంస్థ‌లు వేచి చూసే ధోర‌ణిలో ఉన్నాయి. 2022-23లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ నుంచి వ‌చ్చిన ఆదాయం 91.21 శాతం ఉండ‌గా 2023-24లో 77.27 శాతానికి పడిపోయింది. ఎన్నిక‌ల సంవ‌త్స‌రం కాబ‌ట్టి కాస్త త‌గ్గింద‌ని భావిస్తే 2024-25లో 46.48 శాతానికి ప‌డిపోయింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 18,228.82 కోట్ల ఆదాయం రిజిస్ట్రేష‌న్ల శాఖ నుంచి వ‌స్తుంద‌ని భావిస్తే అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందులు చేస్తే కేవ‌లం రూ.8,473.21 కోట్లు మాత్ర‌మే వ‌చ్చింది. 2025- 26లో కాస్త మెరుగు ప‌డి 79.90 శాతానికి పెరిగింది.

రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయంలో ట్యాక్స్‌ రెవెన్యూనే కీల‌కం.. ట్యాక్స్‌ ఆదాయం పెర‌గాలంటే ఆర్థిక కార్య‌క‌లాపాలు పెర‌గాలి. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు నిత్యం ప‌ని దొరుకుతుంది. ప్ర‌జ‌లు ప‌ని చేయ‌డం ద్వారా సంద‌ను సృష్టించి, ఖ‌ర్చు చేయ‌డం కానీ, ఇత‌ర పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా కానీ ప్ర‌భుత్వానికి ప‌రోక్షంగా ట్యాక్స్‌లు చెల్లించ‌డం ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఆదాయం వ‌స్తుంది. కానీ ఆర్థిక కార్య‌క‌లాపాలు మంద‌గించ‌డంతో ఆదాయం త‌గినంత‌గా రావ‌డం లేద‌న్న అభిప్రాయం కూడా ఉన్న‌ది. నిర్మాణ రంగం ఊపందుకుంటే రిజిస్ట్రేష‌న్ల ఆదాయం పెర‌గ‌డ‌మే కాదు.. జీఎస్‌టీ, సేల్స్ టాక్స్, ఇన్ కం టాక్స్ ద్వారా ఖ‌జానాకు వ‌చ్చే ఆదాయం పెరుగుతుంది. ఇలా స్టేట్ ఓన్ రిసోర్స్ ఎంత పెరిగితే అంత ఆదాయం వ‌స్తుంది. కానీ ఈ రెండున్నరేళ్ల‌లో వేసిన అంచ‌నాల కంటే ఆదాయం త‌క్కువ‌గా ఉంద‌ని కాగ్ లెక్క‌లు చెపుతున్నాయి. ఫ‌లితంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు తేవ‌డంపై కేంద్రీక‌రించింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. మ‌న రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఉన్న‌తాధికారులు నిత్యం రిజర్వ్ బ్యాంకు వ‌ద్ద‌కు అప్పు కోసం వెళుతుంటార‌న్న చ‌ర్చ స‌చివాల‌య వ‌ర్గాల‌లో జ‌రుగుత‌న్న‌ది.

టాక్స్ రెవెన్యూ ద్వారా వ‌చ్చే ఆదాయం వేసిన అంచ‌నా… వ‌చ్చిన ఆదాయం 2023 డిసెంబ‌ర్ నుంచి 2026 మార్చి వ‌ర‌కు

సంవ‌త్స‌రం       వ‌చ్చిన ఆదాయం       వేసిన అంచ‌నా

2023–24       రూ.48,456.23                  రూ.50,833.16

(2023 డిసెంబ‌ర్ నుంచి మార్చి 2024 వ‌ర‌కు)

2024–25       రూ.1,36,283.47         రూ.1,64,397.64

2025–26       రూ.1,52,400.91         రూ.1.75,319.16

మొత్తం       రూ.3,37,140.61             రూ.3,90,549.96

రేవంత్ రెడ్డి స‌ర్కారుకు రెండున్న‌రేళ్ల‌లో రూ. 3,37,140.61 కోట్ల టాక్స్ రెవెన్యూ వ‌చ్చింది. ఇది కాకుండా నాన్ టాక్స్ రెవెన్యూ (ప‌న్నేత‌ర ఆదాయం)తో పాటు కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ క‌లిసి 2023 డిసెంబ‌ర్ నుంచి 2026 మార్చి వ‌ర‌కు రూ.70,422.45 కోట్ల ఆదాయం వ‌చ్చింది. అంతా క‌లిపి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ప‌రిపాల‌న‌లో వ‌చ్చిన ఆదాయం రూ. 4,07,563.06 కోట్లు. ఈ ఆదాయం స‌రిపోద‌ని చేసిన అప్పు రూ.1,37,522.83  కోట్లు మొత్తం క‌లిపి తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చిన ఆదాయం మొత్తం రూ. 5,45,085.89 కోట్లు కాగా చేసిన అప్పుల‌కు చెల్లించిన అస‌లు, వ‌డ్డీ క‌లిసి కేవ‌లం రూ. 65,017.87 కోట్లు మాత్ర‌మే. మిగతా 4.80 ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు దేనికి చేశార‌న్న విమ‌ర్శ‌లు  వెలువ‌డుతున్నాయి. ఉద్యోగుల‌కు, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగులు, కాంట్రాక్ట‌ర్ల‌కు, విద్యార్థుల‌కు, ఆసుప‌త్రుల‌కు చెల్లించాల్సిన ఆరోగ్య‌శ్రీ‌ బిల్లులు ఇలా అన్ని క‌లిపి దాదాపు ల‌క్ష కోట్ల‌కు పైగానే బ‌కాయిలున్నాయ‌ని స‌మాచారం. బ‌కాయిలు చెల్లించ‌లేదు, రైతు భరోసా పూర్తి చెల్లింపులు చేయ‌లేదు… పెద్ద ప్రాజెక్ట్‌లు చేప‌ట్టలేదు… మ‌రి దేనికి రూ.4.80 ల‌క్ష‌ల కోట్లు చెల్లించార‌న్నప్ర‌శ్నస‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్న‌ది.

2023 డిసెంబ‌ర్ నుంచి 2026 మార్చి వ‌ర‌కు ప‌న్నేత‌ర ఆదాయం, కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ వివ‌రాలు

సంవ‌త్స‌రం       ప‌న్నేత‌ర ఆదాయం       గ్రాంట్ ఇన్ ఎయిడ్‌(రూ. కోట్ల‌లో)

2023–24       రూ.4,294.81       రూ.5,197.17

(2023 డిసెంబ‌ర్ నుంచి మార్చి 2024 వ‌ర‌కు)

2024–25       రూ.23,607.77       రూ.7,913.08

2025–26       రూ.18,986.64       రూ.10,422.98

మొత్తం       రూ.46,889.22        రూ.23,533.239

2023 డిసెంబ‌ర్ నుంచి 2026 మార్చి వ‌ర‌కు రాష్ట్రానికి వ‌చ్చిన ఆదాయం చేసిన అప్పు
కాగ్‌కు స‌మ‌ర్పించిన బ‌డ్జెట్ లెక్క‌ల ప్ర‌కారం

వివిధ మార్గాలు               వ‌చ్చిన ఆదాయం (రూ. కోట్ల‌లో)
టాక్స్ రెవెన్యూ                రూ. 3,37,140. 61
ప‌న్నేత‌ర ఆదాయం       రూ 46,889.22
గ్రాంట్ ఇన్ ఎయిడ్         రూ. 23,533.23
చేసిన అప్పు                    రూ. 1,37,522.83
మొత్తం ఆదాయం         రూ. 5,45,085.89

Read Also |

Petrol | ఇండియాలో పెట్రోల్ ఎక్కువగా వాడుతున్న రాష్ట్రం ఇదే!
Meenakshi Natarajan | తెలంగాణలో మీనాక్షి ముద్రేదీ?.. కనిపించని కాంగ్రెస్ ఇంచార్జ్
ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య