" /> " /> " /> " />
“కరుణ” ను పేరులోనే నింపుకున్న కవి ” కరుణశ్రీ”!!
మా గుంటూరు జిల్లా గర్వంగా తలెత్తి చెప్పుకునే కవు
ల వరుసలో జంథ్యాల పాపయ్య శాస్త్రి గారుముందు
వరుసలో వుంటారు.ఆయన్ను….. ప్రత్యక్షంగా చూసి మాట్లాడే భాగ్యమైతే కలిగింది కానీ,ఆయనచెప్పే పాఠాలు వినే అదృష్టం కలుగలేదు. ఆయన ఏసి కళాశాలలో తెలుగు అథ్యాపకులు కాగా.. మేం హిందూ కళాశాల విద్యార్థులం కావడమే దీనికి కారణం.అయితే ఆయన మనవడు ఎమ్మే లో
మా సీనియర్,కావడం,కరుణశ్రీ కుమారుడు
బాపూజీ మా హిందూకళాశాలలో లెక్చరర్ గా వుండటం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవచ్చు.
కరుణశ్రీ గారి కవిత్వం గురించి కొత్తగా చెప్పేదే
ముంది.ఆయన కరుణశ్రీ,ఉదయిశ్రీ సంకలనాలు కవితామతల్లికి రెండు కళ్ళు లాంటివి.ముఖ్యంగా
మరీ ముఖ్యంగా“పుష్ప విలాపం’” “కుంతి కుమారి”
గురించి తెలియనితెలుగు వారుండరంటే అతిశ
యోక్తి కాదు.ఘంటసాల మేస్టారి గొంతులో ఈ
రెండు ఖండికలు ప్రాణం పోసుకున్న వైనం అంద
రికీ తెలిసిందే.కరుణశ్రీ వర్థంతి నేడు.అంటే ….
భౌతికంగా మనకు దూరమైన రోజు.ఈరోజు
ఆయన్ను స్మరించుకుంటూ…వారు రాసిన ఆణిముత్యాల్ని కొన్ని మననం చేసుకుందాం !!
*”నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున
కొమ్మవంచి …
గోరానెడునంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళువిప్పి “మాప్రాణము తీతువా “యనుచు
బావురుమన్నవి..క్రుంగిపోతి నా
మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప
కావ్యమై “!! ( పుష్పవిలాపము )
*అది రమణీయ పుష్పవన.. మావనమునందొక
మేడ ..మేడపై
నదియొక మారుమూల గది..ఆ గది తల్పులు
తీసి మెల్లగా
పదునైదేండ్ల యీడుగల బాలిక..పోలిక
రాచపిల్ల..జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందకు
మెట్లమీదుగన్ “(కుంతికుమారి )
కరుణశ్రీ కేవలం పద్యకవి అనే అపోహ వుంది.
ఆయన చక్కని వచన కవిత్వం కూడా రాశారు.
చైనా దురాక్రమణ సందర్భంగా ఆయన రాసిన
చైనా చిట్టోడా.! పాటు ఆరోజుల్లో బాగా పేలింది.
“ చైనా చిట్టోడా !
. సిసింద్రీల జుట్టోడా
ఏనాటికైనా నువ్వెక్క లేవు మా గోడా
నల్లమందు తింటివా
చెడ్డ కలలు కంటివా
మైదు మాటలెన్నో చెప్పి
మ్యావు మ్యావు మంటివా !”
.... (ఖబడ్డార్ )
“ఎవరు నను మేల్కొల్పి
రీ నవోషస్సులో
ఈ నవోషస్సులో?..
ఈ రస సరస్సులో “
......(ఎంత చక్కని పాణి )
“కన్నెమబ్బు మెరిసింది
పొన్న మాను విరిసింది
పూలవాన కురిసింది
పుడమితల్లి మురిసింది
కోకిలమ్మ పాడింది
కేకి నాట్యమాడింది
మందారం కులికింది
మకరందం చిలికింది “
....( కన్నెమబ్బు మెరిసింది )
చాలా మంది కరుణశ్రీ లోని పద్యాన్నే చవి
చూశారు.ఆయన వచనం కూడా ఆయన
పద్యంలానే మధురంగా వుంటుంది.
కరుణశ్రీ….జీవించినంతకాలం కవిత్వం రాశారు!కవిత్వం రాసినంత కాలం జీవించారు.
ఆ మహాకవికి నివాళులు !!
ఎ.రజాహుస్సేన్.!!
Readmore:మీకు తెలుసా..భూమి ఎంత వేడెక్కుతుందో..?