క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లతో కోట్లు సంపాదించిన యువకుడు!

న్యూయార్క్: సాధారణంగా ఆన్‌లైన్‌లో కానీ, మరెక్కడైనా కానీ ఏవైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్-డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే కొన్ని రివార్డ్ పాయింట్లు వస్తాయి. కొన్నిసార్లు వీటి విలువ వేల్లలో ఉంటుంది. కానీ అమెరికాకు చెందిన ఓ భౌతిక శాస్త్రవేత్త ఇలా వచ్చే రివార్డు పాయింట్లతో కోటీశ్వరుడయ్యాడు. రివార్డు పాయింట్ల ద్వారా ఏకంగా రూ. 2.17 కోట్లు సంపాదించాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. భౌతిక శాస్త్రవేత్త అయిన […]

  • Publish Date - June 1, 2021 / 01:40 PM IST

న్యూయార్క్: సాధారణంగా ఆన్‌లైన్‌లో కానీ, మరెక్కడైనా కానీ ఏవైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్-డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే కొన్ని రివార్డ్ పాయింట్లు వస్తాయి. కొన్నిసార్లు వీటి విలువ వేల్లలో ఉంటుంది. కానీ అమెరికాకు చెందిన ఓ భౌతిక శాస్త్రవేత్త ఇలా వచ్చే రివార్డు పాయింట్లతో కోటీశ్వరుడయ్యాడు. రివార్డు పాయింట్ల ద్వారా ఏకంగా రూ. 2.17 కోట్లు సంపాదించాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. భౌతిక శాస్త్రవేత్త అయిన కొనస్టాంటిన్ అనికీవ్‌కు క్రెడిక్ కార్డుల ద్వారా సంపాదించడమంటే మహా సరదా. 2009 నుంచి అతడు ఇదే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా అతడికి అది ఓ వృత్తిగా మారిపోయి మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించడం మొదలుపెట్టాడు.
కొనస్టాంటిన్ క్రెడిట్ కార్డులు ఉపయోగించి పెద్ద ఎత్తున గిఫ్ట్ కార్డులు కొనేవాడు. తొలుత ఓ గిఫ్ట్ కార్డు కొనేవాడు. ఆ తర్వాత దానిని సొమ్ము చేసుకునేవాడు. ఆ సొమ్మును బ్యాంకులో తన ఖాతాలో డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవాడు. రివార్డు పాయింట్ల ద్వారా వచ్చిన సొమ్ము అతడికి మిగిలిపోయేది.

ఉదాహరణకు 500 డాలర్ల గిఫ్ట్‌కార్డు కొనుగోలు చేస్తే 5 శాతం చొప్పున 25 డాలర్లు వచ్చేవి. గిఫ్ట్‌కార్డును సొమ్ము చేసుకునేందుకు 6 డాలర్లు చెల్లించేవాడు. మిగిలిన 19 డాలర్లు అతడికి లాభంగా మిగిలిపోయేవి. ఇలా ఇప్పటి వరకు అనికీవ్ ఏకంగా 3 లక్షల డార్లు (దాదాపు 2.17 కోట్లు) సంపాదించాడు. అతడి సంపాదన ఒక్కసారిగా పెరగడంతో గుర్తించిన కొందరు అమెరికా పన్నుల శాఖకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అతడి సంపాదన నిజమేనని తేలడంతో అక్రమాస్తుల కింద అతడికి నోటీసులు పంపారు.

కేసు కోర్టుకు చేరింది. విచారణ సందర్భంగా ఓ టబ్బు నిండా గిఫ్ట్‌కార్డులతో కోర్టులో అడుగుపెట్టిన అనికీవ్ తనను తాను సమర్థించుకున్నాడు. రెండు పార్టీల వాదనలు విన్న అనంతరం.. గిప్ట్ కార్డులు ఆస్తుల వంటివేనని, వచ్చిన క్రెడిట్ కార్డు రివార్డులకు పన్నులు ఉండబోవని కోర్టు పేర్కొంది. ఈ కేసు నుంచి రివార్డులకు లెక్కించబోమని పేర్కొంది. అయితే, గిఫ్ట్‌కార్డులను నగదుగా మార్చుకోవడమంటే ఆస్తిని తిరిగి విక్రయించడమేనని పేర్కొంది. కాబట్టి వాటికి పన్ను చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.