ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్‌లు, కఠినమైన డైట్లు, హెవీ వర్కౌట్స్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం రోజూ చేసే సాధారణ నడక శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుందని చెబుతున్నారు. ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి. అయితే సాధారణంగా నడవడం కంటే కొన్ని ప్రత్యేకమైన వాకింగ్ టెక్నిక్స్ పాటిస్తే మరింత వేగంగా ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి రెండు టెక్నిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జపాన్‌లో ప్రాచుర్యం పొందిన ఈ ఇంటర్వెల్ వాకింగ్ పద్ధతి సాధారణ నడకకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒకే వేగంతో నడవకుండా.. మూడు నిమిషాలు చాలా వేగంగా, తర్వాత మూడు నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి.
అలాగే శరీరంలో ఆక్సిజన్ గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో ఊపిరితిత్తులు, గుండె పనితీరు బలపడతాయి. రోజూ గంటల కొద్దీ వాకింగ్ చేయలేని వారికి ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుందని ఫిట్‌నెస్ ట్రైనర్లు చెబుతున్నారు.