టాలీవుడ్‌లో హాస్య బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే థియేటర్లలో నవ్వుల పూలు పూయించే ఈయన, వెండితెరపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఈలలతో థియేటర్లు మార్మోగిపోతాయి.

తాజాగా బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన సంపాదన చూస్తే స్టార్ హీరోలు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బ్రహ్మానందం, భారతదేశంలోనే అత్యధిక ఆస్తి కలిగిన కమెడియన్‌గా అగ్రస్థానంలో నిలిచారు.

బాలీవుడ్ స్టార్ కమెడియన్లు కపిల్ శర్మ, జానీ లీవర్ కంటే కూడా మన బ్రహ్మీ ఆస్తుల విలువ చాలా ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బ్రహ్మానందం మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 320 కోట్ల నుండి రూ. 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సినిమాల ద్వారానే కాకుండా పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా బ్రహ్మానందం భారీగానే ఆర్జిస్తున్నారు. ఆయనకున్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి...

బ్రహ్మీ గ్యారేజీలో కాస్ట్‌లీ కార్లకు కొరత లేదు. ఆయనకు అత్యంత ఖరీదైన ఆడి ఆర్8 (Audi R8), ఆడి క్యూ7 (Audi Q7)తో పాటు ఒక లగ్జరీ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కార్ కూడా ఉంది.

హైదరాబాద్‌లోని మోస్ట్ పాష్ ఏరియా అయిన జూబ్లీహిల్స్‌లో బ్రహ్మానందానికి ఒక భారీ లగ్జరీ బంగ్లా ఉంది. దీనితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉన్నట్లు సమాచారం.

దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన 'చంటబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం.. ఆ తర్వాత 'అహ నా పెళ్ళంట'లో అరగట్రం పాత్రతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆనాటి నుండి నేటివరకు కంటిన్యూస్‌గా నవ్విస్తూ, పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. ఒకప్పుడు చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్‌గా ఎదిగిన బ్రహ్మానందం లైఫ్ జర్నీ నిజంగా ఎందరికో ఇన్‌స్పిరేషన్.