భారత్‌లో వివాహ బంధాన్ని ఇప్పటికీ పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే డిజిటల్ యుగం ప్రభావంతో సంబంధాల రూపురేఖలు నెమ్మదిగా మారుతున్నాయి. ముఖ్యంగా గోప్యమైన ఆన్లైన్ సంబంధాల కోసం రూపొందించిన కొన్ని ప్లాట్‌ఫామ్‌ల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది.
తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, ఇప్పటికే 40 లక్షలకు పైగా భారతీయులు ఇలాంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో సభ్యులయ్యారు.. డేటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన గ్లీడెన్‌లో ఇప్పటికే 40 లక్షల మందికి పైగా భారతీయులు చేరారు. వినియోగదారుల్లో సుమారు 65 శాతం మంది పురుషులు కాగా, 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు సమాచారం.
ఆసక్తికరంగా, గత రెండు సంవత్సరాల్లో మహిళల వినియోగం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మహిళల భాగస్వామ్యం దాదాపు 148 శాతం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది మహిళల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత నిర్ణయాల స్వేచ్ఛకు సంకేతంగా భావిస్తున్నారు.
గోప్యమైన ఆన్లైన్ డేటింగ్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం వినియోగదారుల్లో దాదాపు 18 శాతం మంది అక్కడి వారేనని సమాచారం. హైదరాబాద్ 17 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, పుణే నగరాల్లో కూడా ఈ ప్లాట్‌ఫామ్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
వినియోగదారుల ప్రవర్తనలో కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సభ్యులు రోజుకు సగటున ఒకటి నుంచి గంటన్నర వరకు చాట్లలో గడుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య, అలాగే రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తోంది.
ఇక వయస్సు పరంగా చూస్తే, ఎక్కువ మంది పురుషులు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలను వెతుకుతుండగా, మహిళలు సాధారణంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న పురుషులను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడిన ప్రొఫెషనల్స్ డాక్టర్లు, ఉన్నతాధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వారిపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదల భారత్‌లో సంబంధాలపై ప్రజల ఆలోచనా విధానం మారుతోందనే సంకేతంగా భావిస్తున్నారు.