కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మాత్రం స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. కొన్ని మాటల వల్ల ట్రోల్ మెటీరియల్ అయింది కానీ.. ఇప్పుడు తెలుగులో ఉన్న చాలా మంది యాక్టర్‌ల కంటే బెస్ట్ పర్పార్మెన్సే ఇస్తుంది.. అసలు ఆమె యాక్టింగ్ పొటెన్షియల్ తెలియాలంటే అనగనగా ఒక ధీరుడు సినిమా చాలు.
ఈ సినిమాలో ఐరేంద్రిగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించింది. అసలు ఆ పాత్రలో ఆమె తప్ప ఇంకెవరూ సెట్ కారనే రేంజ్‌లో నటించింది. ఈ సినిమాకు బెస్ట్ విలన్‌గా నంది అవార్డు, సైమా అవార్డులు కూడా వచ్చాయి. ఇవే కాకుండా గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి సినిమాల్లో కూడా అద్భుతంగా నటించింది.
ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ టాలీవుడ్ కంటె ముందు హాలీవుడ్‌లో సినిమాలు చేసిందన్న విషయం మీకు తెలుసా? హాలీవుడ్‌లో సినిమాలతో పాటు చాలా TV సిరీస్‌లలో కూడా మంచి లక్ష్మీ నటించింది. లాస్ వేగాస్ అనే TV సిరీస్‌లో బోల్డ్‌గా నటించింది.