మామిడి పండుని ఫలరాజు అని పిలుస్తారు. వీటిని ఇష్టపడని వాళ్లు చాలా అరుదు. పిల్లలైతే మహా ఇష్టంగా తింటారు. రుచికి తీయగా ఉండే ఈ పండ్లలో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. ఓ మీడియం సైజ్ మామిడి పండులో దాదాపు 45 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా.
ఈ స్థాయిలో షుగర్ శరీరంలోకి వెళ్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్న వారు మామిడి పండ్లు తింటే డయాబెటిస్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది
ద్రాక్ష పండ్లు కూడా చాలా మందికి ఫేవరెట్. చాలా ఇష్టంగా తింటారు. పైగా ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచడంలోనూ ఇవి తోడ్పడతాయి. ముఖ్యంగా జీర్ణ శక్తిని పెంచడంలోనూ సాయపడతాయి.
అరటి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఒక్కటి తిన్నా సరే కడుపు నిండినట్టుగా అవుతుంది. అయితే.. గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రకారం చూస్తే మాత్రం ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే..ఏదైనా తిన్న తరవాత రక్తంలో షుగర్ ఏ మేర విడుదలవుతోంది అనే ఓ లెక్క.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకి మంచి చేస్తాయి. పైనాపిల్ లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. అంటే తిన్నవెంటనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో దాదాపు 16 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. అందుకే డయాబెటిస్ ఉన్న వారు ఈ పండు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.