తమిళ సినీ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య వైవాహిక వివాదం ఇప్పుడు మళ్లీ తమిళనాట సెన్సేషన్‌గా మారింది. ఈ జంట, 2024 చివరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి యావత్ సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేశారు. ఇక రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్మీట్లో జయం రవి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను వేధిస్తున్నారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరు విడాకులకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. జయం రవి భార్య ఆర్తి నెలకు రూ. 40 లక్షల భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆర్థిక డిమాండ్ వీరిద్దరి మధ్య న్యాయపోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది.
జయం రవి అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసుకున్నాడు తన భార్య డిమాండ్ చేస్తున్న భారీ మొత్తంలో డబ్బు.. అదే విధంగా తనపై రోజూ వస్తున్న తప్పుడు ఆరోపణలను గుర్తుచేసుకుని జయం రవి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
నటుడు జయం రవి.. కోర్టులో తన భార్య ఇంత మొత్తాన్ని డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. వారిద్దరి మధ్య ఇకపై రాజీకి ఆస్కారం లేదని స్పష్టం చేసిన ఆయన.. వీలైనంత త్వరగా చట్టబద్ధంగా విడాకులను ఖరారు చేయాలని న్యాయమూర్తిని కోరారు.