భారత క్రికెట్ జట్టులో తమ తోబుట్టువులతో చక్కగా కలిసిపోయే ఆటగాళ్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ప్రముఖులు. వారు తమ ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటూ బంధాన్ని చాటుకుంటారు.  వాళ్ళ సోదరీమణులు కూడా అద్భుత విజయాలు సాధించారు.

అభిషేక్ శర్మ అక్క అయిన కోమల్ శర్మ వృత్తిరీత్యా క్లినికల్ ఫిజియోథెరపిస్ట్. ఆమె గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని, జైపూర్ నుంచి ఫిజియోథెరపీలో మాస్టర్ డిగ్రీని పొందారు. ఆమె ప్రస్తుతం అమృత్‌సర్‌లోని ఎస్.జి.ఆర్.డి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. 

శుభ్‌మన్ గిల్ సోదరి అయిన షెహనీల్ గిల్, ఒక కార్పొరేట్ నిపుణురాలు. వర్ధమాన డిజిటల్ కంటెంట్ సృష్టికర్త. చండీగఢ్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె కెనడా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా పొందారు. ఆమె గతంలో ఒక ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ కంపెనీకి సక్సెస్ కన్సల్టెంట్‌గా కార్పొరేట్ రంగంలో పనిచేశారు.

శ్రేయస్ అయ్యర్ చెల్లెలు శ్రేష్ఠ అయ్యర్ ఒక ప్రొఫెషనల్ డాన్సర్, కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. చిన్నప్పటి నుంచే నృత్యం పట్ల ఆసక్తి ఉన్న శ్రేష్ఠ, ఆ అభిరుచిని వృత్తిగా మార్చుకుని, తరచుగా తన డ్యాన్స్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది.

తన డ్యాన్స్ వీడియోలను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇటీవల, ఆమె వినోద పరిశ్రమలోకి ప్రవేశించి, 'సర్కారీ బచ్చా' చిత్రంలోని 'అగ్రీమెంట్ కర్లే' అనే ఐటమ్ సాంగ్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.

దీపక్ చాహర్ అక్క అయిన మాల్తీ చాహర్ వినోద పరిశ్రమలో సుప్రసిద్ధురాలు. ఆమె బాలీవుడ్ నటి, మోడల్, స్క్రిప్ట్‌రైటర్. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందినప్పటికీ, మాల్తీ ఎప్పుడూ గ్లామర్ ప్రపంచం వైపే ఆకర్షితురాలైంది. ఆమె మిస్ ఢిల్లీ పోటీలో రన్నరప్‌గా నిలిచింది.

సచిన్ టెండూల్కర్ కూతుర్తు అర్జున్ టెండూల్కర్ అక్క అయిన సారా టెండూల్కర్, ఒక బయోమెడికల్ శాస్త్రవేత్త, గుర్తింపు పొందిన పోషకాహార నిపుణురాలు. ఆమె యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి బయోమెడికల్ సైన్స్‌లో డిగ్రీని, క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో డిస్టింక్షన్‌తో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు.

ఆమె ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఆమె ఆరోగ్య సంరక్షణ, పోషకాహారానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సారా ఫ్యాషన్, బ్యూటీ రంగాలలో కూడా చురుకుగా ఉన్నారు.